Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సౌమ్యారెడ్డి పిటిషన్, ఎమ్మెల్యేకు సమన్లు జారీ చెయ్యండి, హైకోర్టు ఆర్డర్, ఏం జరిగింది !

బెంగళూరు: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున బెంగళూరు నగరంలోని జయనగర్ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఎన్నికల్లో 827 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రీకౌంటింగ్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. దీనికి సంబంధించి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరిగి లెక్కించాలని కోరుతూ హైకోర్టు దాఖలు చేసిన ఎన్నికల వివాదం పిటిషన్‌కు సంబంధించి సంబంధిత తహసీల్దార్ కు లేదా అసెంబ్లీ మంత్రిత్వ శాఖ నుంచి జయనగర్ బీజేపీ ఎమ్మెల్యే సీకే. రామమూర్తికి సమన్లు జారీ చెయ్యాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల రీకౌంటింగ్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి హైకోర్టులో ఎన్నికల వివాదం పిటిషన్‌ దాఖలు చేశారు.

Karnataka High Court has issued orders to issue summons to Jayanagara BJP MLA CK Ramamurthy.

సౌమ్యారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జస్టిస్‌ ఎస్‌. రాచయ్య నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం ఆగస్టు 1న ప్రతివాదులందరికీ సమన్లు ​​జారీ చేసింది. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన సీకే. రామమూర్తి, ఇద్దరు స్వతంత్ర పార్టీ సమన్లు ​​అందలేదని తెలిపారు.

అందుకు హైకోర్టు న్యాయమూర్తి మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే సీకే. రామమూర్తికి సమన్లు ​​పంపించాలని ఆదేశాలు జారీ చేసి పిటిషన్ విచారణను సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 10, 2023న ఎన్నికలు నిర్వహించగా, మే 13న ఓట్ల లెక్కింపు జరిగింది.

ఈ నియోజకవర్గంలో మొత్తం 827 పోస్టల్ బ్యాటెల్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో 198 ఓట్లు తిరస్కరణకు గురికాగా 629 ఓట్లను మాత్రమే ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి కి 164 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సీకే. రామమూర్తికి 415 ఓట్లు వచ్చాయి.

Karnataka High Court has issued orders to issue summons to Jayanagara BJP MLA CK Ramamurthy.

చివరి 16వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తికి 57, 297 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డికి 57,591 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 294 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే తిరస్కరణకు గురైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పునఃపరిశీలించాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. దీని ప్రకారం తిరస్కరణకు గురైన పోస్టల్ ఓట్లను మళ్లీ రీకౌంటింగ్ చేశారు.

మధ్యాహ్నం 3.45 నుంచి రాత్రి 8.45 గంటల వరకు పలు దఫాలుగా తిరస్కరణకు గురైన ఓట్ల రీ వెరిఫికేషన్‌ జరిగింది. దీంతో జయనగర అసెంబ్లీ ఎన్నికల ఫలితం తారుమారైంది. చివరకు బీజేపీ అభ్యర్థి సీకే. రామమూర్తి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్ వీడియో రికార్డింగ్ రికార్డులను సమీక్షించాలి. మొత్తం 827 పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించాలని ఆదేశించాలని, చెల్లని ఓట్లతో ఎన్నికైన బీజేపీ అభ్యర్థి సీకే. రామమూర్తి ఎన్నికను రద్దు చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి విజయం సాధించారని ప్రకటించాలని పిటిషన్‌లో కర్ణాటక హైకోర్టుకు మనవి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+