ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్, అలా చెయ్యడానికి కుదరదని చెప్పిన హైకోర్టు, పిటిషన్ లో!
హాసన్ జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి మూలిమణి నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం విచారించింది.
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర హోం శాఖ, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీఐడీ, హాసన్ జిల్లాలోన హోలేనరసీపుర టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, బీజేపీ నేత, న్యాయవాది దేవరాజేగౌడ ప్రతివాదులుగా ఉన్నారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు విషయంలో ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ బయటకు వస్తూనే ఉండటంతో జేడీఎస్ పార్టీ కార్యకర్తలు హడలిపోతున్నారు.

పిటిషనర్ తరఫున న్యాయవాది జీఆర్. మోహన్ హైకోర్టులో వాదనలు వినిపించారు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసులో పలువురు మహిళలు బాధితులుగా ఉన్నారని, అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు దర్యాప్తు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కర్ణాటక హైకోర్టుకు మనవి చేశారు.
వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసు దర్యాప్తు సిట్ చేస్తోందని, అందువలన ఈ కేసు దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించడం కుదరదని చెప్పి విచారణ వాయిదా వేశారు. కేసు నమోదు అయ్యి చాలా రోజులు గడిచాయని, ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, పోలీసులు కూడా అతడి ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నించలేదని, వందలాది మంది మహిళలు బాధితులుగా మారారని ఆరోపించారు.

దీనిని తీవ్రమైన కేసుగా పరిగణించి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని, ఈ కేసును నిర్ణీత గడువులోగా నిష్పక్షపాతంగా విచారించి నిందితులను శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. ప్రజ్వల్ రేవణ్ణ అదృశ్యం కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. హాసన్ లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేసేందుకు కర్ణాటక రాష్ట్ర సమితి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ మంగళవారం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications