కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కేసులో స్టే, ఎంపీ తేజస్వి కేసులో కూడా, ఐటీ హబ్ లో అది జరిగింది !
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యలపై నమోదు అయిన కేసుల దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. దీంతో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఇద్దరూ తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. అరెస్ట్ భయం నుంచి ఇద్దరు నాయకులు తప్పించుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజ్, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యలపై కేసులు నమోదు అయ్యాయి.
బెంగళూరులోని నగర్త్ పేటలో మొబైల్ షాపు యజమానిపై దాడి జరిగిన సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసి, అదే నిరసన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై బెంగళూరులోని కాటన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ప్రాంతంలో బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన ప్రకటనలపై కేసు నమోదు అయ్యింది. ఇద్దరి మీద నమోదు అయిన కేసులకు సంబందించి కర్ణాటక హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై, బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై నమోదు అయిన రెండు వేర్వేరు కేసులను వేర్వేరుగా విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్. రాజకీయ నాయకుల మాటలపై నియంత్రణ పెట్టుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. బెంగళూరు నార్త్ లోక్ సభ నయోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, బెంగుళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు.
కేద్ర మంత్రి శోభా కరంద్లాజేపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో ముడిపెట్టిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టి వెళ్లిపోయాడని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేపై నమోదైన కేసుపై హైకోర్టు కర్ణాటక హైకోర్టు స్టే విధించింది.
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై డీఎంకే ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు కాటన్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు కేసుపై స్టే విధించింది. అలాగే ఫిర్యాదు చేసిన ప్రతివాదులు కాటన్‌పేట పోలీసులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారి ఎం. ఎన్. శివరాజుకు కర్ణాటక హైకోర్టు నోటీసు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.

కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరులోని నగర్తపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు నుంచి ఒకరు వచ్చి బాంబులు వేస్తారని, మరొకరు కేరళ నుంచి వచ్చి యాసిడ్ దాడులు చేస్తారని, మరొకరు ఢిల్లీ నుంచి వచ్చి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యలతో దేశ ప్రజల మధ్య విద్వేషాలు, వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని పోలీసులకు, ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమిళనాడు నుంచి బెంగళూరు నగరానికి వచ్చి బాంబులు పేలుస్తానని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపణలు చెయ్యడంతో దీన్ని తీవ్రంగా ఖండించిన తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నిరసన వ్యక్తం కావడంతో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. దీంతో కాటన్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసును రద్దు చేయాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే హైకోర్టును ఆశ్రయించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications