కర్నాటక క్లాస్ 12 టాపర్ గా హిజాబ్ పోరాటం చేసిన బాలిక..
కర్నాటకలో గతేడాది హిజాబ్ పోరాటం ఉధృతంగా సాగింది. ముస్లిం బాలికలు స్కూళ్లు, కాలేజీలకు హిజాబ్ ధరించి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతివాద సంఘాలతో కలిసి కొందరు విద్యార్ధులు నిరసనలు చేశారు. కాలేజీలకు హిజాబ్ తో వచ్చే విద్యార్ధినులపై దాడులకు దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ బాలిక మాత్రం వారిని ప్రతిఘటించింది. హిజాబ్ తోనే వచ్చి చదువుకుంటానని తేల్చిచెప్పేసింది. విద్యార్ధుల రూపంలో ఉన్నన అల్లరి మూకలు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు.
ఆ తర్వాత కర్నాటకలో హిజాబ్ పోరాటం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఏమీ తేలలేదు. ఆ లోపు కర్నాటక ఎన్నికలు కూడా వచ్చేశాయి. అయితే అప్పట్లో హిజాబ్ ధరించడం కోసం అల్లరి మూకలతో ధైర్యంగా పోరాడి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్లా వైరల్ అయిన ఓ విద్యార్ధిని ఇప్పుడు క్లాస్ 12 ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా టాపర్ గా నిలవడంతో పాటు చదువు కోసం తాను చేసిన పోరాటం వృథా కాలేదని నిరూపించింది.

కర్నాటక క్లాస్ 12 ఫలితాల్ని తాజాగా బోర్డు ప్రకటించింది. ఇందులో 600 మార్కులకు గానూ ఏకంగా 593 మార్కులు సాధించి సదరు హిజాబ్ బాలిక టాపర్ గా నిలిచింది. ఆమె పేరు తబస్సుమ్. తాజాగా సాధించిన విజయం గురించి మాట్లాడుతూ, ఆమె తన హిజాబ్ కంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. హిజాబ్ నిషేధంపై నిర్ణయం వచ్చినప్పుడు, ఆ ఆదేశాలను పాటించమని తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని తబస్సుమ్ చెప్పారు.

రెండు వారాలుగా కాలేజీకి వెళ్లలేదని, ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డానని తెలిపింది కాలేజికి వెళ్లాలని తల్లిదండ్రులు ప్రోత్సహించారని తెలిపింది. తనకు చదువు వస్తే భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలపై గళం విప్పగలనంటోంది. ఇది తనకు ఒక కల సాకారం లాంటిదని వివరించింది. ఐదేళ్ల నుంచి హిజాబ్ ధరిస్తున్నానని తబస్సుమ్ తెలిపింది. ఇవాళ హిజాబ్ ఆమె గుర్తింపులో ఒక భాగంగా మారింది.












Click it and Unblock the Notifications