మెజారిటీ వస్తే ఎవరైనా ఓకేనా ?, ఆ ముగ్గురు ఏం చేస్తారో చూడాలి !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్ పార్టీ అంటూ ఎక్కువగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు ? అనే ప్రశ్న ఆ పార్టీ నాయకుల్లో మొదలైయ్యింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కొంతకాలం క్రితం వరకు మాజీ సీఎం సిద్దరామయ్య పెద్ద దిక్కుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖార్గే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ పార్టీలో సిద్దరామయ్య హవా ఎక్కువ అయ్యింది. ఇదే సమయంలో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వర్గపోరు ఉండటంతో డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత ఆవర్గపోరు ఇంకా ఎక్కువ అయ్యిందని అందరికి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పిన పని చెప్పినట్లు తూచా తప్పకుండా చేస్తున్న డీకే శివకుమార్ ఆ పార్టీ పెద్దల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో మొదటి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మధ్య పోటీ ఉందని కర్ణాటక ప్రజలకు తెలిసిందే. ఈ ఇద్దరు నాయకులతో పాటు లింగాయత్ నాయకుడు ఎంబీ. పాటిల్ తాను కూడా సీఎం రేసులో ఉన్నానని ఇటీవల బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ లింగాయత్ ను సీఎం చెయ్యాల్సి వస్తే మొదటిగా మాజీ మంత్రి ఎంబీ. పాటిల్ పేరు ఉందని ఆపార్టీ నాయకులు కొందరు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖార్గే పేరు కూడా సీఎం రేసులో ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. షావుకారు సతీష్ జారకిహోళి, మహిళలకు అవకాశం వస్తే లక్ష్మీ హెబ్బాల్కర్ సీఎం అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు ? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు, సోనియా గాంధీ దగ్గర నమ్మకంగా ఉంటున్న మల్లికార్జున ఖార్గే రంగంలోకి వస్తే మాత్రం పరిస్థితులు మొత్తం తారుమారు అవుతాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎవరి పేరు చెబితే వాళ్లు కర్ణాటక సీఎం అని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు అంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications