వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown effect:ఉద్యోగం నుంచి తొలగించారా.. జీతంలో కోత విధించారా, అయితే ఫిర్యాదు చేయండి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విలయతాండవం చేయడంతో కంపెనీలపై ప్రభావం చూపుతోంది. దీంతో కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించడమో, జీతాలు తగ్గించడమో చేస్తున్నాయి. అయితే దీనిపై కర్ణాటక కార్మికశాఖ గుర్రుమీద ఉంది. సదరు సంస్థలు ఉద్యోగాలు తీసివేయడమో/ జీతంలో కోత విధించడంపై ఓ కన్నేసి ఉంది. బాధిత ఉద్యోగుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు.

సదరు సంస్థలో ఉద్యోగి జీతం ఇవ్వకున్నా, పని నుంచి తొలగించినా, పని ఇవ్వబోమని చెప్పినా, అక్రమంగా జీతం కట్ చేసిన సంస్థపై టెలీగ్రామ్ యాప్ ద్వారా 8884488067లో ఫిర్యాదు చేయాలని కర్ణాటక కార్మికశాఖ సూచించింది. ఆయా సంస్థల్లో ఉద్యోగులకు తప్పనిసరిగా వేతనం ఇవ్వాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరీ జీతాలు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. దానికి అనుగుణంగా లేబర్ డిపార్ట్‌మెంట్ జీవో కూడా జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నామని కర్ణాటక కార్మికశాఖ కార్యదర్శి కెప్టెన్ మణివన్నన్ తెలిపారు.

Karnataka labour dept starts helpline for employees to report job loss..

లాక్ డౌన్ సందర్భంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించొద్దు అని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి కల్పన మార్చి 20వ తేదీన అడ్వైజరీ జారీచేసింది. జీతం కూడా తగ్గించొద్దు అని స్పష్టంచేసింది. సదరు సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై కర్ణాటకకు చెందిన లాయర్, కార్యకర్త క్లిప్టన్ స్పందిస్తూ..కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారని తెలిపారు. కానీ కర్ణాటకలో సంస్థ/ యాజమానుల లాబీయింగ్ ఎక్కువగా ఉంది అని.. దానిని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు.

Recommended Video

Lockdown : AP CM YS Jagan Urges Muslims To Do Ramzan Prayers @ Home

English summary
Karnataka Labour Department started a helpline to report any retrenchment or pay cuts, on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X