లింగాయత్ మఠాధిపతి శివమూర్తి అరెస్ట్.. విచారణ కోసం రహస్య ప్రాంతానికి తరలింపు
శివమూర్తి మురుగ శరణరును కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను రేప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత విచారణ కోసం రహస్య ప్రాంతానికి తరలించారు. శివమూర్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి తమకు 14 రోజుల కస్టడీ కావాలని జడ్జీని కోరనున్నారు.

అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు స్వామిజీ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు అయ్యింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగా మఠం పరిపాలనా విభాగం అధికారికి, ఆయన భార్యకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకలో మంచి పేరుంది. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న మైనర్ అమ్మాయిలను డాక్టర్ శివమూర్తి మురగా శరణరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇటీవల కేసు పెట్టారు.


Click it and Unblock the Notifications