వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృత్యుంజయుడు.. కూలిన భవనం కింద 62 గంటలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

ధార్వాడ : అవును అతడు మృత్యుంజయుడే. చావు అంచుల దాకా వెళ్లొచ్చి క్షేమంగా బయటపడ్డవాడే. కర్ణాటకలోని ధార్వాడలో భవనం కూలిన ఘటనలో 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకుపోయారు. కానీ సోము అనే వ్యక్తి 62 గంటల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు.

Karnataka Man Pulled Out Safe After 62 Hours from dharwad building collapse

 మావోయిస్టుల కదలికలు మళ్లీనా?.. ఎన్నికల బహిష్కరణకు తెలంగాణ కమిటీ పిలుపు మావోయిస్టుల కదలికలు మళ్లీనా?.. ఎన్నికల బహిష్కరణకు తెలంగాణ కమిటీ పిలుపు

ధార్వాడలోని కుమారేశ్వర లేఅవుట్ లో నిర్మాణ దశలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. దాంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మూడు రోజుల నుంచి శ్రమిస్తూ దాదాపు 70 మందిని రక్షించారు.

మరికొంత మంది ఇంకా శిథిలాల కిందనే చిక్కుకుని ఉండటంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో సోము అనే వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. శిథిలాల కింద 62 గంటల పాటు మృత్యువుతో పోరాడి సోము క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సోమును రక్షించిన వీడియోను సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

English summary
A man who was trapped under the rubble of a collapsed building in Karnataka for over 62 hours was brought out safely by rescue teams this morning. The number of people who died after the four-storey building collapsed in Karnataka's Dharwad earlier this week has gone up to 15. Four to six people are still trapped in the debris as rescue teams are continuing the operation for the fourth day. As many as 55 people were injured in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X