వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి కడుపునిండలేదా ? మళ్లీ తెరపైకి ఆపరేషన్ కమల, మాజీ ప్రధానికి సినిమా, మాజీ సీఎంకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పూర్తి కాలం అధికారంలో ఉండటానికి మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు ఉన్నా కర్ణాటకలో ఆపరేషన్ కమలకు ఆ పార్టీ నాయకులు ఇంకా చెక్ పెట్టినట్లు కనిపించడం లేదని వెలుగు చూసింది. ప్రతిపక్ష జేడీఎస్ పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసిందని వెలుగు చూడటంతో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి తదితర జేడీఎస్ నాయకులు ఉలిక్కిపడ్డారు. రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆ జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అయితే ఆపరేషన్ కమలతో బీజేపీలోకి జంప్ అవుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

ఉప ఎన్నికల ఎఫెక్ట్

ఉప ఎన్నికల ఎఫెక్ట్

కర్ణాటకలో ఇటీవల 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయ్యారని తెలిసింది. 2018 శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జేడీఎస్ లో చేరి తరువాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వారు బీజేపీలో చేరడానికి సిద్దం అవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరంటే ?

జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరంటే ?

జేడీఎస్ పార్టీకి కంచుకోట అయిన మండ్య జిల్లాలో ఇప్పటికే బీజేపీ పాగా వేసింది. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ నియోజక వర్గం జేడీఎస్ ఎమ్మెల్యే రవీంద్ర శ్రీకంఠయ్య, నాగమంగల ఎమ్మెల్యే సురేష్ గౌడ జేడీఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వారి అనుచరులతో చర్చలు జరిపారని మంగళవారం వెలుగు చూసింది.

బీజేపీకి సేఫ్టీ లేదు

బీజేపీకి సేఫ్టీ లేదు

మైసూరు, మండ్య జిల్లాలో బీజేపీ నాయకులకు ఏ మాత్రం సేఫ్టీలేదు. ఇక్కడ జేడీఎస్ తరువాత కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. అయితే ఉప ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మొదటిసారి ఖాతా తెలిచింది. ఇప్పుడు మైసూరు, మండ్య జిల్లాలో తమ పార్టీని బలోపేతం చెయ్యాలని బీజేపీ నాయకులు ఆపరేషన్ కమలకు మళ్లీ శ్రీకారం చుట్టారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సత్తాచాటిన బీజేపీ

సత్తాచాటిన బీజేపీ

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేఆర్ పేట నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ గౌడ (జేడీఎస్ పార్టీ అనర్హత ఎమ్మెల్యే) ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో నారాయణ గౌడ విజయం సాధించిన తరువాత జేడీఎస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి తరువాత జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేలు కావాలని పక్కా ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారని తెలిసింది.

జేడీఎస్ ఎమ్మెల్యే క్లారిటి

జేడీఎస్ ఎమ్మెల్యే క్లారిటి

జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆపరేషన్ కమలతో బీజేపీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారంపై జేడీఎస్ ఎమ్మెల్యే రవీంద్ర శ్రీకంఠయ్య వివరణ ఇచ్చారు. తాను కాని, తన సహచర జేడీఎస్ ఎమ్మెల్యే సురేష్ గౌడ కానీ బీజేపీలో చేరడం లేదని, మేము జేడీఎస్ పార్టీని వదిలిపెడుతున్నామని ఎవరో కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తాము జేడీఎస్ పార్టీని వదిలిపెట్టమని ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్ర శ్రీకంఠయ్య చెప్పారు. అయితే మరో ఎమ్మెల్యే సురేష్ గౌడ మాత్రం మీడియాకు, ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు.

English summary
Operation kamala may continue in Karnataka. Mandya district Nagamangala JD(S) MLA Suresh Gowda and Srirangapatna MLA Ravindra Srikantaiah may join BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X