లాటరీ తగలడం అంటే ఇదే!: రూ. 25 కోట్లు గెలుచుకున్న మెకానిక్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మెకానిక్కు ఊహించని అదృష్టం వరించింది. కేరళలో ఓనం సందర్భంగా కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌తో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. కర్ణాటకలోని మైసూరులోని పాండవపురానికి చెందిన అల్తాఫ్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడు 15 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్నాడు.
కానీ, ఎప్పుడూ అల్తాఫ్‌కు అదృష్టం వరించలేదు. అయితే ఓనం సందర్భంగా కేరళలో ఉన్న తన స్నేహితుడు ఎస్జే ఏజెన్సీ వద్ద అల్తాఫ్ పేరు మీద ఒక టికెట్‌ను కొన్నాడు. తాజాగా తీసిన లాటరీ డ్రా విజేతలను ప్రకటించారు. అందులో అల్తాఫ్ కొన్న టికెట్ నంబర్ TG43222కి మొదటి బహుమతి వచ్చిందని వెల్లడించారు.

తనకు రూ. 25 కోట్లు రావడం పట్ల అల్తాఫ్ పట్టలేని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లాటరీ ద్వారా వచ్చిన నగదును తన ఇంటి నిర్మాణానికి ఖర్చు చేస్తానని అల్తాఫ్ తెలిపాడు. అలాగే తన కుమార్తె పెళ్లికి ఉపయోగిస్తానని చెప్పాడు. ఈ డ్రాలో మరో ఇరవై మందికి రెండో బహుమతి గెలుచుకున్నారు. ఒక్కొక్కరికి రూ.2 కోట్లు బహుమతి వరించింది.
మూడో బహుమతి కింద 20 మందికి రూ.50 లక్షలు చొప్పున గెలుచుకున్నారు. మొత్తం 71 లక్షల పైగానే టికెట్లు అమ్ముడైనట్లు కేరళ లాటరీ డైరెక్టర్ అబ్రహం తెలిపారు. పాలక్కాడ్‌లో అత్యధికంగా టికెట్లు అమ్మడయ్యాయని వివరించారు.
ఇది ఇలావుండగా, ఇటీవల పంజాబ్‌కు చెందిన ఓ స్క్రాప్ డీలర్‌ను లాటరీ రూపంలో అదృష్టం వరించింది. రూ.500తో కొన్న లాటరీ టికెట్ తో కోటీశ్వరుడయ్యారు. రాఖీ సందర్భంగా కొన్న లాటరీ టికెట్ ద్వారా ఏకంగా రూ. 2.5 కోట్లు గెలుచుకున్నారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా ఆదమ్పూర్కు చెందిన ప్రీతమ్ లాల్ జగ్గీ(67) స్క్రాప్ డీలర్‌గా పని చేస్తున్నాడు.
కాగా, గత 50 ఏళ్లుగా ఆయనకు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. రాఖీ సందర్భంగా రూ.500తో ఓ లాటరీ టికెట్‌ను తన భార్య అనీతా జగ్గీ పేరు మీద కొన్నారు. ఈసారి మాత్రం ఆయన కొన్న టికెట్‌తో రూ.2.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications