గాలి జనార్దన్ రెడ్డికి నేను అంటే ఎంతో ప్రేమ, మైనింగ్ కింగ్ మీద మంత్రి సెటైర్లు, ఎన్నికేసులు !
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మీద కర్ణాటక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి నాపై చాలా ప్రేమ ఉందని కర్ణాటక మంత్రి నాగేంద్ర సెటైర్లు వేశారు. అక్రమ ఆస్తుల కేసులో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్‌కు కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వలన తాత్కాలికంగా ఊరట లభించింది.
ఈ నేపథ్యంలో కోప్పల జిల్లాలోని గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర స్పందించారు. బుధవారం బళ్లారిలో విలేకరులతో మాట్లాడిన మంత్రి నాగేంద్ర కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కేసు విషయంలో మాకు స్పష్టత ఉంది. ఆ కేసులు సక్రమంగా జరగలేదని. ఆ సమయంో అప్పటి బీజేపీ ప్రభుత్వం స్పీకర్ అనుమతి తీసుకోలేదని మంత్రి బి. నాగేంద్ర అన్నారు.

ఆ సందర్బంలో బీజేపీ నాయకులు డీకే శివకుమార్ ను జైలుకు పంపిస్తే చాలు అనే ఆసక్తి చూపించారని, ఆ సమయంలో డీకే శివకుమార్ ను జైల్లో పెడితే సరిపోతుందని బీజేపీ నాయకులకు అనిపించిందని, అందువల్ల బీజేపీ నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి నాగేంద్ర ఆరోపించారు. కాబట్టి, మేము ఇప్పుడు మేము డీకే శివకుమార్ కేసులకు సంబంధించి అడ్వకేట్ జనరల్ నుండి న్యాయ సలహాలు తీసుకున్నామని మంత్రి నాగేంద్ర చెప్పారు.
అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను తీసుకుని వాటిని ఫాలో అవుతున్నామని, అందుకే డీకే శివకుమార్ మీద నమోదు అయిన సీబీఐ కేసులను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి నాగేంద్ర మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి స్టేట్ మెంట్ కూడా తాను చూశానని మంత్రి బి. నాగేంద్ర అన్నారు.
నేను అంటే గాలి జనార్ధన్ రెడ్డికి చాలా ప్రేమ అని, ఆయన అభిమానానికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని, మా కేసులు ఈరోజే గానీ, రేపు గానీ పరిష్కారమవుతాయని మంత్రి నాగేంద్ర ఆయన మీద కామెంట్లు చేసిన గాలి జనార్ధన్ రెడ్డికి జలక్ ఇచ్చారు. డీకే శివకుమార్ కేసులు వేరు, మా మా కేసులు వేరు అని, డీకే శివకుమార్ తప్పు చెయ్యలేదు కనుకే ఆయన మీద నమోదు అయిన సీబీఐ కేసులను కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీపుకుందని, రాజకీయ ప్రేరేపితంగానే డీకే శివకుమార్ మీద కేసులు పెట్టారని కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర అన్నారు.

కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్‌కు న్యాయం చేసిన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన కేబినెట్‌లో ఉన్న మంత్రి నాగేంద్రపై ఇరవై ఐదుకు పైగా కేసులను ఉపసంహరించుకోలేరా ? అని గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మైనింగ్‌కు సంబంధించి నాపై ఐదు కేసులు ఉండగా, కర్ణాటక మంత్రి నాగేంద్రపై ఇరవై ఐదుకు పైగా కేసులు ఉన్నాయని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
సీఎం సిద్ధరామయ్య గతంలో బళ్లారి మైనింగ్ విషయంలో పెద్ద పోరాటమే చేశారని, ఇప్పుడు అదే నాగేంద్రను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శివకుమార్‌లపై సీబీఐ విచారణకు ఇచ్చిన అనుమతిని సిద్దరామయ్య వెనక్కి తీసుకుని డీకే శివకుమార్ కు న్యాయం చేశారని, మంత్రి నాగేంద్రకు అన్యాయం చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications