శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, శ్రీరాముడి శాపాలు మీకు తగులుతాయి, మంత్రి ఫైర్ !

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ సూచన మేరకు అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఇన్‌ఛార్జ్‌ మంత్రులపై ఉందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప అన్నారు. అదే సమయంలో శ్రీరాముడి శాపం బీజేపీకి కచ్చితంగా తగులుతుందని కర్ణాటక మంత్రి మధు బంగారప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి బీజేపీపై విరుచుకుపడ్డారు.

చిత్రదుర్గాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు బంగారప్ప మంగళూరు తాను ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నానని, కాబట్టి మంగళూరు పరిదిలోని అన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇప్పటి నుంచి తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉన్నానని అన్నారు. సిట్టింగ్ మంత్రిని లోక్ సభకు వెళ్లమని పార్టీ హైకమాండ్ చెబితే తాము అంగీకరించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

Karnataka Minister Madhu Bangarappa made sensational comments that BJP will be cursed by Sri Ram

ప్రజాల కోసం సవ్యంగా పరిపాలన సాగాలంటే పార్టీ నేతలు చెప్పిన మాట వినాల్సిందేనని మధు బంగారప్ప అన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రపై దాడికి ప్రయత్నించడంపై స్పందించిన మంత్రి మధు బంగారప్ప బీజేపీ మీద విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించడం కొత్తేమీ కాదని, చిల్లర చేష్టలు చెయ్యడంలో బీజేపీ నంబర్ 1 అని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ భక్తులం కాదన్నట్లుగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మధు బంగారప్ప మండిపడ్డారు. ఇతర మతాలకు, కులాలకు గౌరవం ఇచ్చేవారే నిజమైన హిందువులు అని, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మన దేశానికి దేవుడు అని ఆయన అన్నారు. ఒక పార్టీకి ఒక దేవుడిని బీజేపీ నాయకులు ప్రజల మీద బలవంతంగా మతం రంగు రుద్దుతున్నారని, ఇది మంచిపద్దతి కాదని కర్ణాటక మంత్రి మధు బంగారప్ప ఆరోపించారు.

మీరు రామ భక్తులు అయితే మరికొందరు రాముడి వ్యతిరేకులా? మేము అన్ని మతాల భక్తులమని మంత్రి మధు బంగారప్ప అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు, దీనిని మేము ఖండిస్తున్నామని కర్ణాటక మంత్రి మధు బంగారప్ప బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+