మోదీ గేమ్ ఛేంజర్ కాదు, నేమ్ ఛేంజర్, ప్రియాంక్ ఫైర్, ఉదయానిధి, ప్రియాంక్ మీద కేసులు !

బెంగళూరు/న్యూఢిల్లీ: ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్‌గా మార్చడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఐటీ, బీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖార్గే కేంద్ర ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

భారతదేశం రూపురేఖలు మార్చేస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. మేము గేమ్ ఛేంజర్స్ అని చెప్పుకునే మోదీ టీమ్ కేవలం నేమ్ ఛేంజర్స్ అయ్యారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Karnataka Minister Priyank Kharge Says PM Modi Govt Not Game Changer But Name Changer

2014కు ముందు అమెరికా, బ్రిటన్, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడింది. ఇప్పుడు గుజరాత్ మోడల్, యూపీ మోడల్ పేరుతో కులాలు, మతాల మధ్య విద్వేషాలను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం పెంచి పోషించిందని, అందుకే ఇప్పుడు దేశం మణిపూర్ మోడల్ సృష్టించారని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రియాంక్ ఖార్గే మండిపడ్డారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో భారత్ ను పోల్చేలా చేస్తూ తమ వెన్ను తట్టుకున్న బీజేపీ నుంచి ఇప్పుడు మనం దేశం పేరు మార్చడం తప్ప ఇంకేం ఆశించాలి చెప్పండి. అంతటి అసమర్థులైన పాలకులు భారతదేశంలో మార్పు తీసుకువస్తారని మేము ఆశించడం లేదని, భారతదేశం పేరును మార్చారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్ పేరు మార్చడంపై మంత్రి దినేష్ గుండూరావు వరుస ట్వీట్ల ద్వారా ఇప్పటికే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Priyank Kharge

ప్రతిపక్ష పార్టీల కూటమి పేరును ఇండియాగా పెట్టడం వలనే ఇండియా పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇండియా అనే ప్రతిపక్షాల కూటమికి ఎన్‌డీఏతో పాటు బీజేపీ నాయకులు అంతగా భయపడుతున్నారా? అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సనాతనా ధర్మాన్ని కించపరస్తూ ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ సంచలన వ్యాఖల్యు చెయ్యడంతో ఆయన మీద కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, వివిద పార్టీలకు చెందిన నాయకులు మండిపడుతున్నారు. తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే సమర్థిస్తున్నానని బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

Priyank Kharge

ఇదే సందర్బంతో తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే మీద ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఇద్దరి మీద కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మీద ఇప్పటికే ఉదయానిధి స్టాలిన్ మీద ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లో కూడా కేసులు నమోదు అయ్యాయి. అయితే తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, తాను వెనక్కి తగ్గను అని ఉదయానిధి స్టాలిన్ తేల్చి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+