Aunty: అమ్మకు ఇద్దరు మొగుళ్లు, 32 మందితో కూతుర్ని ఏం చేసిందంటే ?, ఆంటీ కాదు !

బెంగళూరు/ చిక్కమగళూరు/ శృంగేరి: ప్రముఖ పుణ్యక్షేత్రంలో అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటి వరకు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారని, అనేకసార్లు అత్యాచారం చేశారని నమోదైన కేసుల్లో 32 మంది కామాంధులను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఇంతకాలం అమ్మాయి వెంట ఉన్నది ఆమె ఆంటీ కాదని, అమ్మ అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అమ్మాయి సామూహిక అత్యాచారం కేసులో ఒక్కొక్కటిగా పచ్చి నిజాలు బయటకు వస్తున్నాయి. అమ్మాయి అమ్మకు ఇద్దరు మొగుళ్లతో పాటు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది.

పుణ్యక్షేత్రంలో దారుణం

పుణ్యక్షేత్రంలో దారుణం

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరి పట్టణం ఉంది. శృంగేరిలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి దక్షిణ భారతదేశంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం వెలుతుంటారు. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరిలో 15 ఏళ్ల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపింది.

 ఆరోజు జరిగిన కథ వేరే

ఆరోజు జరిగిన కథ వేరే

2021 జనవరి 30వ తేదీన పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరి పట్టణంలో 15 ఏళ్ల అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగడంతో కర్ణాటకను కుదిపేసింది. చిక్కమగళూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శృతి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు టీమ్ లు అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు విచారణ ముమ్మరం చేశారు. శృంగేరి గ్యాంగ్ రేప్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు సైతం ప్రత్యేక శ్రధ్దతో విచారణ చేస్తున్నారు.

 ఆంటీకి రెండో మొగుడు

ఆంటీకి రెండో మొగుడు

ఉత్తర కర్ణాటకకు చెందిన సావిత్రి అనే మహిళ రెండు సంవత్సరాల క్రితం భర్తను వదిలేసి ఓ అమ్మాయితో కలిసి శృంగేరి పట్టణం చేరుకునింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా వేరే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సావిత్రి కాపురం పెట్టింది. తన వెంట ఉన్నది తన అక్క కుమార్తె అని కట్టుకున్న రెండో భర్తతో పాటు చుట్టుపక్కల వాళ్లు అందర్నీ నమ్మించింది.

జెండా ఎత్తేసిన రెండో మొగుడు.... గ్యాంగ్ రేప్

జెండా ఎత్తేసిన రెండో మొగుడు.... గ్యాంగ్ రేప్


ఏడాది పాటు సావిత్రతో కాపురం చేసిన ఆమె రెండో మొగుడు కూడా జెండా ఎత్తేయడంతో సావిత్రి అమ్మాయితో కలిసి వేరుగా ఉంటోంది. తరువాత కొందరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న సావిత్రి కాలం గడుపుతోంది. ఇదే సమయంలో సావిత్రి ఇంట్లో ఉన్న అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు 2021 జనవరి 30వ తేదీన కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు.

 నేను అమ్మాయి ఆంటీని

నేను అమ్మాయి ఆంటీని


పోలీసులు బాధితురాలైన 15 ఏళ్ల అమ్మాయి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని విచారణ చేశారు. ఇదే సమయంలో అమ్మాయి తన అక్క కూతురని, తన కూతురు కాదని సావిత్రి పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. సావిత్రి ఎక్కడి నుంచి శృంగేరికి వచ్చింది ?, మొగుడు ఎందుకు వదిలేశాడు ?, ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ? అంటూ పూర్తి సమాచారం బయటకు లాగేశారు.

 ఆంటీ కాదు సొంత అమ్మ

ఆంటీ కాదు సొంత అమ్మ

పోలీసుల విచారణలో సావిత్రి అమ్మాయికి చిన్నమ్మ కాదని, సొంత అమ్మ అని బయటపడింది. మొదటి మొగుడు, రెండో భర్త వదిలేయడంతో డబ్బు మీద ఆశపడిన సావిత్రం కొందరితో అక్రమ సంబంధాలు పెట్టుకునిందని, చివరికి కన్న కూతురితో వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించిందని, అందుకు అమ్మాయి ఎదురు తిరిగితే యువకులను రెచ్చగొట్టి వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసి కన్న కూతురి మీద అత్యాచారం చేయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ఇంత నీచానికి దిగజారిందా

ఇంత నీచానికి దిగజారిందా

ఆర్థిక సమస్యలు, డబ్బు కోసం ఆశ పడిన సావిత్రి కన్న కూతురిని వ్యభిచారం కూపంలోకి లాగిందని పోలీసులు అన్నారు. ఇదే సమయంలో అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ మాత్రమే జరగలేదని, ఆమెపై అనేక మంది కామాంధులు అత్యాచారం చేశారని చిక్కమగళూరు జిల్లా అడిషనల్ పోలీసు కమిషనర్ శృతి మీడియాకు చెప్పారు.

అమ్మాయి జీవితం నాశనం చేసిన 32 మంది

అమ్మాయి జీవితం నాశనం చేసిన 32 మంది


15 ఏళ్ల అమ్మాయి గ్యాంగ్ రేప్, వరుస అత్యాచారాల కేసుల్లో ఇప్పటి వరకు 32 మందిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో ఆమె తల్లి సావిత్రి ప్రధాన నిందితురాలని చిక్కమగళూరు జిల్లా అడిషనల్ పోలీసు కమిషనర్ శృతి మీడియాకు చెప్పారు. ఇంకా ఈ కేసులో కొంత మంది తప్పించుకోవడంతో వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+