పౌరసత్వ సవరణ చట్టం, కర్ఫూ, మంగళూరులో పోలీసు కాల్పులు, ఐసీయూలో ముగ్గురు, సీఎం షాక్ !
మంగళూరు/బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ఫూ విధించినా ఆందోళనకారులు రోడ్ల మీదకు చొచ్చుకురావడంతో వారిని నియంత్రించడానికి కాల్పులు జరపవలసి వచ్చిందని కర్ణాటకలోని మంగళూరు పోలీసులు తెలిపారు. పోలీసు కాల్పుల్లో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరు మందికి తీవ్రగాయాలు కావడంతో వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెలుగు చూసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కర్ణాటకలోని అనేక ప్రాంతాలతో సహ మంగళూరు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

మంగళూరులో పరిస్థితి విషమించడంతో పోలీసులు 144 సెక్షన్ జారీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కర్ఫూ విధించారు. కర్ఫూ అమలులో ఉన్నా ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ సమయంలో పోలీసులు హెచ్చరించినా ఆందోళనకారుల మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసమయంలో పోలీసులు మంగళూరు నగరంలోని బందరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆరు మందికి తీవ్రగాయాలైనాయి. వెంటనే వారిని మంగళూరు నగరంలోని యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మంగళూరు నగరంలో ఆందోళనలు ఎక్కువ కావడంతో ఎక్కడ మత ఘర్షణలు జరుగుతాయో అనే అనుమానంతో బుధవారం రాత్రి నుంచి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే గురువారం ఆందోళనకారులను అదుపు చెయ్యడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ మంగళూరులో ఇలాంటి సంఘటన జరగడంపై విషాదం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. వెంటనే మంగళూరుకు ఉన్నత పోలీసు అధికారులను పంపించామని, పరిస్థితి అదుపులో ఉందని సీఎం యడియూరప్ప మీడియాకు చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications