వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: 70 శాతం రిజర్వేషన్లు

|
Google Oneindia TeluguNews

బెళగావి/బెంగళూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉపాధి కల్పనలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 50 నుంచి 70 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు.

బెళగావిలో జరుగుతున్న విధాన పరిషత్ శీతాకాల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో రిజర్వేషన్ల సంబంధిత ముసాయిదాను ప్రవేశ పెడుతామని సిద్దరామయ్య చెప్పారు.

Karnataka: SC/STs and other backward classes from 50 to 70 per cent.

రిజర్వేషన్ల పెంపుపై జరిగిన చర్చలో సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుని అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం రాష్ట్ర ప్రజల సమాజిక, విద్య, ఆర్థిక విషయాలపై సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

వచ్చే నెల (డిసెంబర్)లో సర్వే నివేదిక సిద్దం కానుందని చెప్పారు. సర్వేకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించినపుడే సామాజిక న్యాయాన్ని సాధించడం సులువవుతుందని సిద్దరామయ్య స్పష్టం చేశారు. మొత్తం మీద సీఎం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Chief Minister Siddaramaiah on Tuesday said that his government would take all initiatives to increase reservation for SC/STs and other backward classes from 50 to 70 per cent. Caste census of Karnataka State Commission for Backward Classes will be tabled in two months, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X