సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు, పరుగో పరుగు !
బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలోని స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో హాజరైనారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు గడవులోపు రెబల్ ఎమ్మెల్యేలు మరోసారి వారి రాజీనామా లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కు సమర్పించారు.
ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి చేరుకునే సమయంలో గట్టి భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు కర్ణాటక డీజీపీ నిలమణి రాజుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

డీజీపీ నీలమణి రాజు సూచనల మేరకు పోలీసు అధికారులు హెచ్ఏఎల్ విమానశ్రం, విధాన సౌధ దగ్గర భారీ బందో ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు హెచ్ఏఎల్ విమానాశ్రం నుంచి ప్రత్యేక బస్సులో స్పీకర్ రమేష్ కుమార్ ముందు హాజరు కావడానికి వచ్చిన రెబల్ ఎమ్మెల్యేలను పిలుచుకుని విధాన సౌధ చేరుకున్నారు..
విధాన సౌధలో ప్రత్యేక బస్సు దిగిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు ఎక్కడ తమను ప్రత్యర్థులు హైజాక్ చేస్తారో అనే ఆందోళనతో స్పీకర్ కార్యాలయం వైపు పరుగు తీశారు. పోలీసులు, మార్షల్స్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా రెబల్ ఎమ్మెల్యేల్లో మాత్రం ఆందోళన కనిపించింది. రెబల్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన స్పీకర్ రమేష్ కుమార్ వీడియో చిత్రీకరణతో వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications