కావేరి వాటర్ చలో తమిళనాడు: అర్దరాత్రి వదిలేశారు
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు తన బెట్టువీడి తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేసింది. సోమవారం కర్ణాటక ప్రత్యేక శాసన సభ సమావేశం జరిగింది. ఆ సందర్భంలో తమిళనాడుకు కావేరీ నీళ్లు వదిలిపెట్టరాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరోక్షంగా తమిళనాడుకు నీళ్లు వదిలిపెట్టడం మంచిది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిద్దరామయ్య వ్యాఖ్యలతో ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. అయితే ఇప్పటికే ఆరు సార్లు సుప్రీం కోర్టు తమిళనాడుకు కావేరీ నీళ్లు వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేసిందని కర్ణాటక ప్రభుత్వం గుర్తు చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుంటే సమస్యలు వస్తాయని భావించిన సిద్దరామయ్య ప్రభుత్వం సోమవారం అర్దరాత్రి కృష్ణరాజసాగర్ డ్యాం ( కేఆర్ ఎస్) నుంచి 6,856 క్యూ సెక్కులు నీరు విడుదల చేసింది.
అందులో తమిళనాడుకు 4,000 టీఎంసీల నీరు వెళ్లింది. మిగిలిన 2,856 క్యూ సెక్కుల నీరు కెనాల్ ద్వారా కర్ణాటక రైతులు అందించారు. కబిని జలాశయం నుంచి 3,500 క్యూసెక్కుల నీరు పూర్తిగా తమిళనాడుకు వదిలిపెట్టారు.
ఎట్టకేలకు కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యడంతో తమిళ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే సీఎం సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications