హిజాబ్ తో పరీక్షలు రాయనివ్వండి- సుప్రీంకు కర్నాటక బాలికలు-ఈసారి ముగ్గురితో బెంచ్
కర్నాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో బాలికల హిజాబ్ ధారణ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఇద్దరు జడ్డీల సుప్రీంకోర్టు బెంచ్ అక్టోబర్ లో తీర్పు వెలువరించింది. అయితే ఈ బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులివ్వడంతో హిజాబ్ వ్యవహారం సస్పెన్స్ లో పడింది. ఇప్పుడు దీనిపై విచారణ చేపట్టి హిజాబ్ లతో పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని విద్యార్ధినులు సుప్రీంను కోరారు.
కర్నాటక విద్యార్ధుల తరఫున పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ మీనాక్షి అరోరా విజ్ఞప్తిపై స్పందించిన ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ .. తాను ఈ పిటిషన్ ను పరిశీలించి విచారణ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ పిటిషన్ ను విచారిస్తుందని కూడా వెల్లడించారు.

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలకు వలస వెళ్తున్నారని అరోరా సీజేఐకి తెలిపారు. కానీ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహిస్తారని, ప్రైవేట్ కళాశాలలు పరీక్షలు నిర్వహించలేవనే అంశాన్ని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications