అసెంబ్లీ ఎన్నికల వేళ- బీజేపీ యువ నేత దారుణ హత్య

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధార్వాడ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ధార్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హతుడి పేరు ప్రవీణ్ కమ్మర్. వయస్సు 34 సంవత్సరాలు. నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు ఆయన స్వగ్రామం. ఈ గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు కూడా. మంగళవారం కొత్తూరు గ్రామంలో వెలిసిన ఉడచమ్మ దేవి ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రవీణ్ కమ్మర్‌ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ప్రతి సంవత్సరం ఉడచమ్మ దేవి జాతరను నిర్వహిస్తుంటారు. వందలాదిమంది భక్తులు దీనికి హాజరవుతుంటారు.

bjpleaderpraveen-

పొరుగు జిల్లా నుంచి ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రవీణ్ కమ్మర్‌పై దాడి చేసి, కత్తులతో పొడిచినట్లు ధార్వాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బీ లోకేష్ తెలిపారు. మద్యం మత్తులో అమ్మవారి జాతరలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోన్న వారిని ప్రవీణ్ కమ్మర్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో వారు ప్రవీణ్‌పై కత్తులతో దాడి చేసినట్లు ఎస్పీ చెప్పారు.

రక్తపుమడుగులో పడి ఉన్న ఆయనను హుటాహుటిన హుబ్లీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బీజేపీ యువ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అటు కొత్తూరు గ్రామంలో కూడా ఉద్రిక్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ బలగాలను మోహరింపజేశారు.

ప్రవీణ్ కమ్మర్ హత్య పట్ల బీజేపీ జాతీయ యువ మోర్చా అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ లోక్ సభ సభ్యుడు తేజస్వి సూర్య దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీజేవైఎం ధార్వాడకు చెందిన ప్రవీణ్ కమ్మర్ హత్యోదంతం తనను కలచి వేసిందని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేశారని, హంతకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తేజస్వి సూర్య ఓ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+