వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు పోరు- నేడు సుప్రీంకోర్టు కీలక విచారణ-ఏమాత్రం తేడా వచ్చినా ?

|
Google Oneindia TeluguNews

కర్నాటక-మహారాష్ట్ర మధ్య నెలకొన్న సరిహద్దుల వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపబోతోంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు విన్న సుప్రీంకోర్టు... ఇవాళ మరోసారి ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ విచారణ ఇరు రాష్ట్రాలకు కీలకంగా మారడంతో సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. విచారణ పూర్తయి తీర్పు ఇస్తే ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకల్ని కూడా నియంత్రిస్తున్నారు.

 కర్నాటక-మహారాష్ట్ర వివాదం

కర్నాటక-మహారాష్ట్ర వివాదం

1956లో బొంబాయి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినప్పటి నుండి రాష్ట్ర సరిహద్దులో కొన్ని పట్టణాలు, గ్రామాలను చేర్చడంపై మహారాష్ట్ర, కర్ణాటక మధ్య వివాదం మొదలైంది. ఈ చట్టం 1953లో నియమించిన జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రూపొందించారు. రెండు సంవత్సరాల తర్వాత దాని నివేదికను కమిషన్ సమర్పించింది. ఆ తర్వాత నవంబర్ 1, 1956 న మైసూర్ రాష్ట్రం కాస్తా కర్ణాటకగా పేరు మార్చుకుంది. పొరుగున ఉన్న బొంబాయి రాష్ట్రం తరువాత మహారాష్ట్ర అయింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు మాత్రం కొనసాగాయి. కర్ణాటకలోని వాయువ్య జిల్లా బెలగావి తమ రాష్ట్రంలో భాగం కావాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఇది ఓ దశాబ్దం పాటు హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. అలాగే మహారాష్ట్ర ఏకికరణ్ సమితి (MES) ఏర్పాటుకు కూడా దారితీసింది. ఇది ఇప్పటికీ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో అధికారంలో ఉంది.

 బోర్డర్ వివాదంలో కేంద్రం పాత్ర

బోర్డర్ వివాదంలో కేంద్రం పాత్ర

మహారాష్ట్ర నిరసనలు, ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25, 1966న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహర్‌చంద్ మహాజన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పుడు ఎస్. నిజలింగప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే మహారాష్ట్రలో వీపీ నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నివేదిక రెండు రాష్ట్రాలకు బైండింగ్ డాక్యుమెంట్‌గా ఉండి వివాదానికి ముగింపు పలకాలని భావించారు. కమిషన్ తన నివేదికను ఆగస్టు 1967లో సమర్పించింది. ఈ నివేదిక కర్ణాటకలోని 264 పట్టణాలు, గ్రామాలను (నిప్పాణి, నంద్‌గడ్, ఖానాపూర్‌తో సహా) మహారాష్ట్రతోలో, అలాగే మహారాష్ట్రలోని 247 గ్రామాలను (దక్షిణ షోలాపూర్, అక్కల్‌కోట్‌తో సహా) కర్ణాటకలో విలీనం చేయాలని సిఫార్సు చేసింది.

 భాషా డిమాండ్లతో అటకెక్కిన రిపోర్ట్

భాషా డిమాండ్లతో అటకెక్కిన రిపోర్ట్

కేంద్రం నియమించిన మెహర్‌చంద్ మహాజన్ కమిషన్ నివేదిక 1970లో పార్లమెంటులో ప్రవేశపెట్టినా చర్చకు మాత్రం రాలేదు. ఈ నివేదికలో సిఫార్సులు అమలు చేయకుండా మరాఠీ మాట్లాడే ప్రాంతాలు మహారాష్ట్రలో భాగం కావాలని, కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో భాగం కావాలనే డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. దీంతో బెలగావి జిల్లాలో ఎంఈఎస్ రాజకీయంగా కీలకంగా మారడంతో పాటు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చింది. 1999 నాటికి సరిహద్దు ప్రజలు భాషా పరంగా విడిపోవడంతో ఎంఈఎస్ కూడా ఓడిపోయింది.

 శీతాకాల అసెంబ్లీ నిర్మించిన కర్నాటక

శీతాకాల అసెంబ్లీ నిర్మించిన కర్నాటక

ఆ తర్వాత 2007లో కర్నాటక మరో ఎత్తు వేసింది. ఈ బెలగావిలో శీతాకాల అసెంబ్లీ నిర్మించింది. 2012లో ఈ భవనం ప్రారంభమై ప్రతీ ఏటా చలికాలంలో ఇక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఈ ప్రాంతం తమదేనని చెప్పుకునేందుకు కర్నాటక తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయి. గతేడాది కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు తలెత్తాయి. అలాగే ఈ ఏడాది కూడా అసెంబ్లీ సమావేశాల్లో సరిహద్దు సమస్యపై కన్నడ, మరాఠా గ్రూపులు రెచ్చిపోతాయనే భయాలు నెలకొన్నాయి. డిసెంబర్ 3న, మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు - చంద్రకాంత్ పాటిల్, శంబురాజే దేశాయ్ బెలగావిని సందర్శించబోతున్నారు. మరోవైపు కన్నడ సంఘాలు, మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలకు సీనియర్ మంత్రులతో కూడిన సొంత ప్రతినిధి బృందాన్ని పంపించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

 సుప్రీంను ఆశ్రయించిన మహారాష్ట్ర

సుప్రీంను ఆశ్రయించిన మహారాష్ట్ర

గతంలో మహారాష్ట్రలో భాగంగా ఉన్న కర్నాటక 1956లో విడిపోయిన సందర్భంగా తయారుచేసిన రాష్ట్ర పునర్ వ్యవస్ధీకరణ చట్టంలో కొన్ని నిబంధనల్ని ఆ రాష్ట్రం సవాల్ చేసింది. కర్ణాటకలోని ఐదు జిల్లాల నుంచి 865 గ్రామాలను తమకు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు వినబోతోంది. కర్ణాటకలో, ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెలగావి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వాస్తవానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర 2004లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విచారణకు వచ్చింది. రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, అలా చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని వాదించేందుకు కర్ణాటక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని ప్రస్తావిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల్లో జోక్యంచేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉందంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 131ని మహారాష్ట్ర ప్రస్తావిస్తోంది.

English summary
supreme court on today will hear maharastra govt peititon against karnataka over border dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X