వైద్యం నిరాకరణ: రోడ్డుపైనే ప్రసవించిన మహిళ, సీఎం దిగ్భ్రాంతి
బీదర్: ఔరద్‌లోని తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అక్టోబర్ 13వ తేదీన చోటు చేసుకుంది. ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. 'ఔరద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందక రోడ్డుపైనే మహిళ ప్రసవించిందనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరోగ్యశాఖను ఈ విషయంపై ప్రశ్నించా. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా' అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
అక్టోబర్ 13న మహారాష్ట్రకు చెందిన సురేఖ దీపక్ అనే గర్భిణీ మహిళ ప్రసవం కోసం ఔరద్ తాలూకా ఆస్పత్రికి వచ్చింది. అయితే, ఇది చాలా క్లిష్టతరమైన కేసు అని, ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, బీదర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని తాలూకా ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న శిల్పా షింధే.. ఆమెకు సూచించారు.

దగ్గరలో ఎలాంటి ప్రైవేటు ఆస్పత్రి కూడా లేకపోవడంతో ఆ గర్భిణీ కుటుంబం ఎక్కడికి వెళ్లాలో తోచక ఆస్పత్రి ముందే ఉండిపోయింది. కాగా, సురేఖకు నొప్పులు ఎక్కువ కావడంతో వెంటనే వైద్యం అందించాలని.. ఆస్పత్రిలోని వైద్యులను వేడుకున్నాడు ఆమె భర్త, తల్లి.
కాగా, నొప్పులు పడుతున్న సురేఖ వైద్యం అందించకపోగా.. ఇక్కడ్నుంచి వెళ్లకపోతే పోలీసులకు ఫోన్ చేస్తామని వారిని బెదిరించారు వైద్యులు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌ను అందించలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో ఆస్పత్రి నుంచి బయటకి వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయింది సురేఖ. కాగా, రోడ్డుపైనే తల్లి సాయంతో బిడ్డను ప్రసవించింది సురేఖ.
బిడ్డను ప్రసవించిన అనంతరం సురేఖను ఆస్పత్రిలో వైద్యులు చేర్చుకున్నారని సురేఖ భర్త దిలిప్ కుమార్ తెలిపాడు. ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని మెడికల్ ఆఫీసర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. కాగా, ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications