వైద్యరంగంలో సంచలనం:కోలార్ మహిళలో కొత్త బ్లడ్ గ్రూప్..!!

రక్తదానం చేయడమంటే అది ఒకరికి ప్రాణదానం చేయడమే. రక్తదానం చేయడం నీకు కొన్ని క్షణాలు మాత్రమే తీసుకుంటుంది... కానీ అది ఒకరికి జీవితాన్ని ఇస్తుంది. ఇప్పుడు రక్తదానం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందా అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఒకరికి రక్తం సరిపోక ప్రాణాల మీదకు వచ్చినప్పుడు వైద్యులు చికిత్సలో భాగంగా రక్తం ఎక్కించాలని పేషెంట్ కుటుంబ సభ్యులకు చెప్తారు. ఇక ఆ రక్తం కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. ఎందుకంటే రక్తదానం చేసే దాత రక్తం పేషెంట్ బ్లడ్ గ్రూప్‌తో సరిపోలి ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో పేషెంట్‌ది అరుదైన బ్లడ్ గ్రూప్ ఉంటే రక్తం దొరకడం కష్టమే. అయితే కర్నాటక రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధితో ఓ హాస్పిటల్‌లో చేరిన మహిళకు రక్తం అవసరం కాగా ఆమె రక్తాన్ని పరీక్షించిన వైద్యులు కొత్త విషయాన్ని కనుగొన్నారు.

బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, కానీ...
కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళి గుండె సంబంధిత వ్యాధితో స్థానిక హాస్పిటల్‌లో సర్జరీ కోసం అడ్మిట్ అయ్యింది.ఇక ఆమె రక్తాన్ని పరిశీలించిన డాక్టర్లు ఆమె గ్రూప్ ఓ- పాజిటివ్ (O Positive)అని నిర్థారించారు. అయితే తీరా రక్తం ఎక్కిద్దామని డిసైడ్ అయిన సమయంలో ఏ ఒక్క ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ సరిపోలలేదు. ఇది ఏంటో అక్కడి వైద్యులకు అంతు చిక్కలేదు. దీంతో వారు ఈమె బ్లడ్ శాంపిల్స్‌ను బెంగళూరులోని అడ్వాన్స్‌డ్‌ ఇమ్యూనోహెమటాలజీ ల్యాబ్‌కు పంపారు. అయితే అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఆమె బ్లడ్‌ గ్రూప్‌తో ఏ బ్లడ్ గ్రూప్ సరిపోవడం లేదని తేల్చేశారు.ఇదొక అరుదైన బ్లడ్ గ్రూప్ ఉంటుందని నిర్థాణకు వచ్చారు. ఇక ఆ మహిళ కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది నుంచి రక్తపు శాంపిల్స్ సేకరించారు. వారిలో ఎవరిదో ఒకరిది మ్యాచ్ అవుతుందని భావించిన డాక్టర్లకు నిరాశే మిగిలింది. అయితే ఈ కేసును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన వైద్యులు మొత్తానికి ఆ మహిళకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. అది కూడా ఎలాంటి రక్త మార్పిడి లేకుండానే.

karnataka-womans-rare-blood-group-leads-to-a-global-medical-breakthrough

క్రిబ్ బ్లడ్ గ్రూప్
సర్జరీ అయితే విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్లకు ఆ బ్లడ్ గ్రూప్ రహస్యం ఏంటో కనుక్కోవాలని భావించారు. దీంతో ఆమె శాంపిల్స్‌ను బ్రిటన్‌ దేశంలోని బ్రిస్టల్‌లో ఉన్న ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబ్ (IBGRL)కు పంపారు.దాదాపుగా 10 నెలల పాటు ఈ శాంపిల్ పై పరిశోధన చేసిన వైద్యులు.. ఇంతకుముందు ఎప్పుడూ లేని కొత్త బ్లడ్ గ్రూప్ యాంటిజెన్‌ను కనుగొన్నారు. ఇది క్రోమర్ బ్లడ్ గ్రూప్ సిస్టం‌కు సంబంధించిందని నిర్థారించారు. దీనికి సీఆర్ఐబీ (CRIB) అని అధికారికంగా నామకరణం చేశారు.ఇందులో CR అంటే క్రోమర్ అని IB అంటే ఇండియా, బెంగళూరు అని పెట్టారు. ఇండియాలోని బెంగళూరు నుంచి వచ్చిన శాంపిల్ అది కూడా తొలి ఆవిష్కరణ కావడంతో ఈ అరుదైన బ్లడ్ గ్రూప్‌కు ఈ పేరు పెట్టారు.ప్రపంచంలోనే CRIB యాంటిజెన్ కలిగి ఉన్న తొలి మహిళగా కోలార్ మహిళ గుర్తింపు పొందారు.

భవిష్యత్తులో మరింత సురక్షితం
వైద్యరంగంలో అరుదైన రక్త సమూహాలపై వచ్చిన ఒక కీలక పురోగతి భవిష్యత్తులో అవయవ మార్పిడి, అత్యవసర రక్త మార్పిడులను మరింత సురక్షితం చేయనుంది. 'క్రిబ్' (CRIB) వంటి సరికొత్త యాంటిజెన్‌లను గుర్తించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రక్త మార్పిడి ప్రక్రియ మరింత భద్రంగా మారనుంది. దీంతో, రక్త సమూహాల అనుకూలతను పరీక్షించడం (compatibility testing) మరింత మెరుగవుతుంది. ముఖ్యంగా, భవిష్యత్తులో వచ్చే వైద్య అత్యవసర పరిస్థితుల్లో సరిగ్గా సరిపోయే దాతలను కనుగొనేందుకు ఇది ఒక బలమైన పునాది వేస్తుంది.

ఈ అద్భుతమైన ఆవిష్కరణ అంతర్జాతీయ ఇమ్యునోహెమటాలజీ (రక్త సంబంధిత రోగనిర్ధారణ) పరిశోధనలో భారత్‌ను కీలక దేశంగా నిలబెట్టింది.ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి, వివిధ జనాభా సమూహాలలో రోగులకు వేగవంతమైన, సురక్షితమైన వైద్య ఫలితాలను అందించడానికి సహాయపడుతుంది. అరుదైన రక్త సమూహాలతో వచ్చే సవాళ్లకు ఇకపై సమర్థవంతమైన పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+