తులా రాశి, వృశ్చిక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో తులా రాశి, వృశ్చిక రాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
మిథున రాశి, కర్కాటక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

తులా రాశి (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)

డిసెంబరు నెల తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రంగాల్లో పురోగతి ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. కార్యాలయంలో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే తోటి ఉద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు రాకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అనవసర వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకపోవడం మంచిది.

మేష రాశి, వృషభరాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
మేష రాశి, వృషభరాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope Predictions and results for these two zodiac signs Libra and Scorpio for the Month of December

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా వాత మార్పుల వల్ల చిన్నపాటి అనారోగ్యం రావచ్చు. వేళకు భోజనం చేయడం, నీరు ఎక్కువగా త్రాగడం శ్రేయస్కరం. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం, తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

డిసెంబరు నెల వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా, లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థికపరమైన నిర్ణయాలు కలిసి వస్తాయి.

కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి.ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పాత దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+