బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM VS Minister: సీఎం మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి, నా దాంట్లో జోక్యం ఎందుకు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సొంతపార్టీ నేతలతో తలనొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారంలో సీఎం యడియూరప్పను ప్రతిపక్షాలు ముప్పుతిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం సార్ అనవసరంగా నా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కావాలనే నా శాఖలో తలదూర్చి మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వకుండా చేస్తున్నారని ఓ సీనియర్ మంత్రి కర్ణాటక గవర్నర్ కు లేఖరాయడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో దూమరం లేపింది.

Illegal affair: మరదలు సూపర్ ఫిగర్, బార్ డ్యాన్సర్, తట్టుకోలేని బావ, కుర్రాడి ఎంట్రీతో ?Illegal affair: మరదలు సూపర్ ఫిగర్, బార్ డ్యాన్సర్, తట్టుకోలేని బావ, కుర్రాడి ఎంట్రీతో ?

 మొదటి నుంచి రాయి టెంకాయి

మొదటి నుంచి రాయి టెంకాయి

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆ రాష్ట్ర గ్రామీణ, పంచాయితీరాజ్ శాఖా మంత్రి కేఎస్. ఈశ్వరప్పకు మొదటి నుంచి పడదు. రాజకీయంగా ఇద్దరూ బీజేపీ సీనియర్ నేతలు అయినా ఓకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. యడియూరప్ప, ఈశ్వరప్ప శివమొగ్గ జిల్లాకు చెందిన వారు కావడంతో ఆధిపత్యపోరు, పదవుల పందెరంలో పట్టుదలకు పోయి ప్రాణస్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ రాయి టెంకాయిలా మారిపోయారు.

సీఎం సార్ జోక్యం ?

సీఎం సార్ జోక్యం ?


కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కావాలని తన శాఖల్లో ( గ్రామీణ, పంచాయితీరాజ్ శాఖలు) గత ఏడాది నుంచి అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, నిధులు కేటాయించినా వాటిని మేము సధ్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా సీఎం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు మా మాట వినడం లేదని మంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఆరోపింస్తున్నారని తెలిసింది.

 గవర్నర్ లేఖతో కలకలం

గవర్నర్ లేఖతో కలకలం


సీఎం బీఎస్. యడియూరప్ప మీద ఆరోపణలు చేస్తూ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలాకు లేఖ రాయడం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది. గవర్నర్ వాజూబాయ్ వాలాకు మంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఏకంగా ఐదు పేజీల లేఖ రాసి ఏకంగా ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద ఆరోపణలు చెయ్యడం బీజేపీలో కలకలం రేపింది.

పనిలో పనిగా హైకమాండ్ కు లేఖలు

పనిలో పనిగా హైకమాండ్ కు లేఖలు

కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప మీద ఆరోపణలు చేస్తూ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలాకు లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో మంత్రి కేఎస్. ఈశ్వరప్ప సీఎం మీద మండిపడుతూ ఆ లేఖను ఢిల్లీలోని హైకమాండ్ కు పంపించారని తెలుసుకున్న బీజేపీ నేతలు, సాటి మంత్రులు ఉలిక్కిపడ్డారు.

గవర్నర్ ను ఎందుకు కలిశానంటే ?

గవర్నర్ ను ఎందుకు కలిశానంటే ?


సీఎం యడియూరప్ప మీద గవర్నర్ కు మీరు ఎందుకు ఫిర్యాదు చేశారు అని మంత్రి ఈశ్వరప్పను మీడియా ప్రశ్నిస్తే ఆయన స్టైల్లో సమాధానం ఇచ్చారు. గవర్నర్ వాజూబాయ్ వాలాతో తన శాఖల విషయాల గురించి చర్చించడానికి అవకాశం వచ్చింది, వెళ్లి మాట్లాడి వచ్చానని మంత్రి కేఎస్. ఈశ్వరప్ప అన్నారు.

ఢిల్లీకి అయినా సరే.... పోతా

ఢిల్లీకి అయినా సరే.... పోతా

అవసరం అయితే తాను కేంద్ర మంత్రులు, ఢిల్లీలోని బీజేపీ నాయకులను కలిసి తన శాఖలను ఎలా అభివృద్ది చెయ్యాలని వారితో చర్చించి వారి సూచనలు, సలహాలు తీసుకుంటానని మంత్రి కేఎస్. ఈశ్వరప్ప అన్నారు. తాను అసహనంతో సీఎం మీద గవర్నర్ కు ఎవరిమీద ఫిర్యాదు చెయ్యలేదని, తన పనితాను చేసుకుని వెలుతున్నానని కేఎస్. ఈశ్వరప్ప క్లారిటీ ఇచ్చారు.

శివ శివ.....ఈశ్వరప్ప.... ఏందప్పా

శివ శివ.....ఈశ్వరప్ప.... ఏందప్పా


ఇప్పటికే రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారంలో సీఎం యడియూరప్పను ప్రతిపక్షాలు ముప్పుతిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సమయంలో మరో మంత్రి కేఎస్. ఈశ్వరప్ప కారణంగా సీఎం యడియూరప్పకు మరో ఇబ్బంది ఎదరైయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
In a letter to party high command and governor Vajubhai Vala rural development and panchayat raj minister K. S. Eshwarappa explained chief minister B. S. Yediyurappa of direct interference in his ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X