సోషల్ మీడియాలో హిందీ భాష: మండిపడ్డ కరుణానిధి
చెన్నై: ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో ప్రభుత్వ అధికారులు హిందీ భాషను ఉపయోగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంపై డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి గురువారం తీవ్రంగా విమర్శించారు. ఈ పరిణామం హిందీయేతర రాష్ట్రాల ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేదిగా ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
భాషా యుద్ధం ఇప్పటిది కాదని ఆయన అన్నారు. గతంలో హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయని కరుణానిధి గుర్తు చేశారు.

హిందీయేతర భాష మాట్లాడే పౌరులు కోరుకునే వరకు ఇంగ్లీష్ భాషనే అధికారిక భాషగా కొనసాగించాలని నెహ్రూ ఇచ్చిన హామీని మర్చిపోయామని ఆయన చెప్పారు.
హిందీ, హిందీయేతర ప్రజల మధ్య ఆంక్షలు పెట్టడం లాంటివి కాకుండా.. ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కరుణానిధి సూచించారు.












Click it and Unblock the Notifications