చెన్నైకి చంద్రబాబు, రాష్ట్రపతి కోవింద్: 30ని.లు కుర్చీలో కూర్చున్న కరుణానిధి
అమరావతి/చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు చెన్నైకి వెళ్లనున్నారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ఆయన పరామర్శించనున్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా డీఎంకే అధినేతను గురువారం పరామర్శించనున్నారు. కరుణ ఆరోగ్యంపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. సమాచారం మేరకు ఆయన ఢిల్లీ నుంచి చెన్నైకి మధ్యాహ్నం రానున్నారు. కరుణను పరామర్శించి ఆ తర్వాత మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల మధ్య ఢిల్లీకి చేరుకోనున్నారు.

పలువురు అభిమానుల మృతి
కరుణ ఆరోగ్యంపై బెంగతో ఆయన అస్వస్థతకు గురైన నాటి నుంచి దాదాపు 21 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కరుణానిధి కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అంతకుముందు రోజు తెలిపారు. ప్రస్తుతం కరుణానిధి కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వద్దన్నారు.
Recommended Video

కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉందని, తలైవార్ ఆరోగ్యంపై ఆందోళనతో 21 మంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,. కార్యకర్తలు స్థిమితంగా ఉండాలని, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేమన్నారు.
తాము ఎంతో అభిమానించే కరుణ ఆసుపత్రి పాలయ్యారని తెలిసి డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. శనివారం నుంచి కావేరీ ఆసుపత్రికి అభిమానులు తరలి వస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. ఇటీవల కావేరీ ఆసుపత్రి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టారు.
మెరుగుపడుతున్న కరుణ ఆరోగ్యం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఆయన కుర్చీలో దాదాపు 30 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారని తెలుస్తోంది. ఆయన గత ఆరు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశ్రాంతి కోసం రెండు రోజుల క్రితం.. బుధవారం అతనిని 30 నిమిషాల పాటు కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు.
కరుణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన తనయుడు ఎంకే స్టాలిన్ కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలను దాదాపు పక్కన పెట్టారు. తండ్రి క్రమంగా కోలుకుంటుండటంతో ఆయన గురువారం రాత్రి పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, తన పని చేసుకున్నారు. తమిళనాడులో తొలి బ్రాహ్మణేతర పూజారిని కూడా ఆయన కలిశారు.
శుక్రవారం ఉదయం స్టాలిన్, డీఎంకే పార్టీకి చెందిన పలువురు నేతలు స్వతంత్ర సమరయోధుడు తీరన్ చిన్నమలైకి నివాళులు అర్పించారు. ఆయన 213వ జయంతి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications