• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముగిసిన కరుణానిధి శకం: మృత్యువుతో పోరాడుతూ కలైంజ్ఞర్ కన్నుమూత

By Srinivas
|
  జయకు నో, కరుణకు ఏమంటారో!!!

  చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణ మృతి విషయం తెలియగానే పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఆయన మృతి విషయం తెలియగానే అభిమానులు సొమ్మసిల్లిపడిపోయారు.

  ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలుఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

  ఆయన ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండు రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. కరుణ కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. వయోభారం కారణంగా చికిత్సకు శరీరం సహకరించడం లేదని చెప్పారు. మంగళవారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసినప్పటి నుంచే కార్యకర్తలు తరలి వచ్చారు.

  DMK chief Karunanidhi is no more

  కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలై 26వ తేదీన ఆయను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరుణ మృతి నేపథ్యంలో రేపు, ఎల్లుండి ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేశారు. నేడు, రేపు సినిమా షోలు బంద్ చేశారు.

  కరుణానిధి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రాజాజీ హాలులో ఉంచనున్నారు. రేపు (బుధవారం) ఏడు గంటల వరకు సందర్శించవచ్చు. మెరినా బీచ్‌లో ఉన్న అన్నా సమాధి పక్కనే కరుణకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది. రేపు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరుణ మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బుధవారాన్ని పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. వారం రోజులు సంస్మరణ దినంగా నిర్వహిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఒకరోజు (బుధవారం) సంతాప దినాన్ని ప్రకటించింది.

  మూత్రనాళం ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగింది. బీపీ డౌన్ అవ్వడంతో కావేరి ఆసుపత్రికి తరలించారు. 11 రోజులుగా ఆయన కావేరి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ వర్గాలు.. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించాయి.

  డీఎంకే విజ్ఞప్తికి ప్రభుత్వం నో

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలకు మెరినా బీచ్ ఒడ్డున నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు. అన్నా సమాధి పక్కనే స్థలం కేటాయించాలని కరుణ కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. అందుకు పళనిస్వామి సర్కార్ నిరాకరించింది. గాంధీ మండపం దగ్గర రెండు వేల ఎకరాలు కేటాయించింది. డీఎంకే దీనిపై హైకోర్టుకు వెళ్లింది. రాత్రి పదిన్నర గంటలకు జస్టిస్ రమేష్ విచారించున్నారు. కాగా, మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో డీఎంకే కార్యకర్తలు హింసకు దిగుతున్నారు. స్టాలిన్ ప్రధానితో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.

  కరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. కరుణానిధి 1924 జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు. ఆయనకు ముగ్గురు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

  కరుణానిధి పార్థివదేహాన్ని కావేరీ ఆసుపత్రి నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు రేపు చెన్నైకి రానున్నారు.

  English summary
  Karunanidhi is no more, DMK chief and Tamil Nadu former Chief Minister Karunanidhi dead in Kauvery hospital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X