తెలివి, కఠినశ్రమ: మోడీపై కరుణానిధి ప్రశంసల జల్లు
చెన్నై: బిజెపి పార్లమెంటరీ పార్టీ నేత, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీపై డిఎంకె చీప్ కరుణానిధి ప్రశంసల జల్లు కురిపించారు. వినయపూర్వక ప్రారంభానికి, తెలివికి, కఠినశ్రమకు మోడీని ఆయన కొనియాడారు. గుజరాత్‌లో వినయంతో ప్రారంభమై భారత దేశంలోని అత్యున్నత స్థానానికి ఎదగడం నిజంగా అభిమానించదగిందని ఆయన అన్నారు.
విజ్ఞానం, కఠినమైన నిజాయితీతో కుడి శ్రమ కారణంగా నరేంద్ర మోడీ ఎదిగారని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కరుణానిధి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

నరేంద్ర మోడీ పాలన పేదలు, యువత, మహిళల ప్రగతికి అంకితమవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి దేశం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తోందని ఆయన అన్నారు. దేశంలోని విశాలమైన అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ మోడీ పాలన సంతోషకరంగా, సంతృప్తికరంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.
పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు కూడా కరుణానిధి మోడీని ప్రశంసించారు. కఠిన శ్రామికుడని, తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications