33 కు చేరిన మృతుల సంఖ్య.. హీరో విజయ్ ను అరెస్ట్ చేస్తారా..?
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. క్షతగాత్రులను కరూర్ లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ర్యాలీకి అనుకోకుండా వేలాదిమంది ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
తమిళనాడులో ఒక్కసారిగా ఊహించని విషాదం జరిగింది. తమిళ స్టార్ హీరో,టీవీకే అధినేత విజయ్ విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 33 మంది మరణించారు. మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది.
Very scary..
— Karnan 𝕏 🖤 (@instinctper07) September 27, 2025
Hope others recover #TVK #TVKCampaign #Karur
pic.twitter.com/jUKP7cKrEU
ఘటనాస్థలంలో స్పృహ తప్పి పడిపోయిన వారిని అంబులెన్స్ ల్లో ఆస్పత్రికి తరలించారు. తమ వాళ్ల పరిస్థితి ఎలా ఉందో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక పలువురు ఆస్పత్రిలో ఏడుస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఆస్పత్రికి చేరేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ర్యాలీలో చాలామంది చిన్నారులు అదృశ్యం అయినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఫ్రీగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై రేపు ఉదయం వరకు ప్రాథమిక రిపోర్టు అందించాలని సీఎం స్టాలిన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో,టీవీకే అధినేత విజయ్ విజయ్ ను అరెస్ట్ చేస్తారా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో పుష్ప-2 విడుదల సమయంలో HYD సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందారు. ఆ కేసులో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా కరూర్ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందడంతో విజయ్‌ను కూడా అరెస్ట్ చేస్తారా? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే కరూర్ కార్నర్ మీటింగ్ కు పోలీసులు 10 వేల మందికే పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడికి 2 లక్షల మంది వచ్చారు. అంతమందికి సరపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు అక్కడి మీడియా ఛానళ్లు చెబుతున్నాయి. 33 మంది మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు విజయ్ రావాల్సిన సమయం కంటే 5-6 గంటలు ఆలస్యంగా వచ్చారని, ఎటువంటి నియంత్రణ లేకుండా ఒక చిన్న స్థలంలో వేలాది మంది గుమిగూడటమే తొక్కిసలాటకు దారి తీసిందని తమిళ మీడియా పేర్కొంది. సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని పలువురు అంటున్నారు.












Click it and Unblock the Notifications