అల్లుడిగా వచ్చి మొగుడయ్యాడు.. వీడు మామూలోడు కాదురోయ్..
ప్రస్తుత కాలంలో చాలామంది వావివరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ యువకుడు పిల్లనిచ్చిన అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాక అడ్డుగా ఉన్న భార్యను హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అత్త, అల్లుడి రొమాన్స్ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇద్దరూ జంప్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని కాస్‌గంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పిల్లనిచ్చిన అత్తకే లైనేశాడు అల్లుడు. ఈ క్రమంలో అల్లుడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకుంది. అత్తా అల్లుడి రొమాన్స్ ఫోటోలు, వీడియోలు బయటపడడంతో వారి బాగోతం తెలిసింది. దీంతో అడ్డుగా ఉన్న భార్యను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమోద్ అనే యువకుడితో శివాని(20)కి 2018 లో వివాహం జరిగింది. అయితే శివాని తల్లితో ప్రమోద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై శివానితో ప్రమోద్ కు తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో ఇటీవల శివానితో ప్రమోద్ కు తీవ్ర స్థాయిలో వివాదం జరిగింది. దీంతో శివానిని ప్రమోద్ హతమార్చాడు. తన కుటుంబంతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే శివాని అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమోద్ తో శివాని తల్లి అక్రమ సంబంధం ఉన్నట్లు శివాని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పరారైన ప్రమోద్ ఫ్యామిలీని పట్టుకునే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications