వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 మంది మృతి, కొట్టుకపోయిన పెళ్లి బస్సు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య గురువారం నాటికి 20కి చేరింది. తాజాగా రాజౌరి జిల్లాలో వరద ప్రవాహాంలో పెళ్లి బృందం బస్సు కొట్టుకపోయిన దుర్ఘటనలో ఏకంగా 50 మంది మరణించినట్లు భావిస్తున్నారు. 50 మంది పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు గంభీర్ నది వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురిని మాత్రమే రక్షించగలిగారు. మిగిలిన వారు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. బాధితుల ఆచూకీకోసం అధికారులు రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు.

పూంచ్ జిల్లాలో రక్షణ చర్యల్లో పాల్గొన్న ఆర్మీ జవాన్ బల్బీర్ సింగ్ వరదల్లో కొట్టుకుపోయాడని పోలీసులు తెలిపారు. ఇదే జిల్లాలో ఓ బీఎస్ ఎఫ్ అధికారి కొండచరియల కిందపడి సజీవ సమాధి అయ్యాడని వివరించారు. వరదల్లో ఆస్తినష్టం సంభవించిందని ప్రభుత్వం వెల్లడించింది.

జీలం, చీనాబ్ సహా రాష్ట్రంలో చాలా నదులు ప్రమాదస్దాయిని మించి ప్రవహిస్తున్నాయని వివరించింది. జమ్ము కాశ్మీర్ వరదలపై కేంద్ర హొంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం ఈ విషయంపై సమీక్షించారు. విద్యాసంస్దలకు మూడు రోజుల పాటు సెలవులిచ్చారు.

 కాశ్మీర్‌లో వరద భీభత్సం

కాశ్మీర్‌లో వరద భీభత్సం

జీలం, చీనాబ్ సహా రాష్ట్రంలో చాలా నదులు ప్రమాదస్దాయిని మించి ప్రవహిస్తున్నాయి.

 కాశ్మీర్‌లో వరద భీభత్సం

కాశ్మీర్‌లో వరద భీభత్సం

వరద భీభత్సానికి రొడ్డంతా కొట్టుకపోయిన దృశ్యం. ఈ వరదలపై కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు.

కాశ్మీర్‌లో వరద భీభత్సం

కాశ్మీర్‌లో వరద భీభత్సం

వరద బీభత్సానికి బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యం. రాజౌరి జిల్లాలో వరద ప్రవాహాంలో పెళ్లి బృందం బస్సు కొట్టుకపోయిన దుర్ఘటనలో ఏకంగా 50 మంది మరణించినట్లు భావిస్తున్నారు.

 కాశ్మీర్‌లో వరద భీభత్సం

కాశ్మీర్‌లో వరద భీభత్సం

వరద బీభత్సానికి బిల్డింగ్ కూలిపోతున్న వద్ద పోలీసులు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య గురువారం నాటికి 20కి చేరింది.

English summary
At least fifty people were feared dead on Thursday after a bus carrying a wedding party was washed away by flash floods in Jammu and Kashmir’s Rajouri district, even as 20 other flood-related deaths were reported from other parts of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X