ఉదయాన్నే ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి, ఇద్దరు ఉగ్రవాదుల్ని చంపిన సైన్యం
శ్రీనగర్: పాకిస్తాన్ - భారత్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్‌లోని హంద్వారాలో మిలిటెంట్స్ ఆర్మీ క్యాంప్ పైన దాడి చేశారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
హంద్వారాలోని రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. ఈ కాల్పులు గురువారం వేకువజామున ఐదు గంటలకు జరిగింది.

సరిహద్దుల్లో మనం సైన్యం అప్రమత్తంగా ఉంది. మిలిటెంట్లు కాల్పులు జరపగానే వెంటనే ఎదురుదాడి చేసి వారిని చిత్తు చేశారు. కాగా, ఆర్మీ క్యాంప్ పైన దాడి జరగడం గత మూడు వారాల్లో ఇది మూడోసారి. యూరి ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఆదివారం బారాముల్లా క్యాంప్ వద్ద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడయ్యారు. తీవ్రవాదులు తప్పించుకున్నారు.












Click it and Unblock the Notifications