బీహార్ విద్యాశాఖ ఘోర తప్పిదం: కాశ్మీర్ మరో దేశమంటూ..

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్ విద్యా శాఖ దారుణమైన పొరపాటు చేసింది. ఏడో తరగతి పరీక్షల్లో కాశ్మీర్ మన దేశం కాదన్నట్లుగా ప్రశ్నను ఇచ్చింది. ఓ విద్యార్థి గుర్తించడంతో ఇది వెలుగు చూసింది.

హాల్ టికెట్‌లో తప్పుడు ఫొటోలు రావడం, టాపర్‌ స్కామ్‌లతో బీహార్ విద్యాశాఖ పేరు ఇప్పటికే మారుమోగిపోయింది. ఇప్పుడు ఏడో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో కాశ్మీర్‌ను భారత్‌లో భాగంగా కాకుండా దాన్నొక దేశంగా పరిగణించి మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.

Kashmir not in India: Bihar question paper

అక్టోబర్‌ 5న బీహార్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్‌ కింద పరీక్ష నిర్వహించారు. ఏడో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఓ పరీక్షలో ఐదు దేశాల పేర్లను ఇచ్చి అక్కడ నివసిస్తున్న ప్రజలను ఏమని పిలుస్తారని ప్రశ్న ఇచ్చింది.

అందులో చైనా, నేపాల్‌, ఇంగ్లాండ్‌, భారత్‌తో పాటు కాశ్మీర్‌ను చేర్చింది. ఈ విషయాన్ని ఏడో తరగతి విద్యార్థి ఒకరు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై బీహార్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు కౌన్సిల్‌ (బీఈపీసీ) స్టేట్‌ ప్రొగామ్‌ అధికారి ప్రేమ్‌చంద్ర స్పందించారు. ఇది ప్రింటింగ్‌లో వచ్చిన తప్పిదమన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to experts in the Bihar education department, Kashmir is not a part of India but a separate country. A question paper prepared by the state board for class VII students across all government schools asked them to name what the people of five countries — China, Nepal, England, Kashmir and India —are called. The examination, which commenced on October 5, will end on Wednesday. They are being conducted under the Centre's Sarva Shiksha Abhiyan, which is overseen in the state by the Bihar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి