వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీరీ బాలుడికి జాతీయ అవార్డు...ఇంతవరకు ఆ చిన్నారికి చేరని సమాచారం

|
Google Oneindia TeluguNews

శుక్రవారం రోజున జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తమ ఉర్దూ భాషా చిత్రంగా హమీద్ చిత్రం అవార్డు గెలుచుకుంది. అంతేకాదు ఉత్త బాలనటుడు అవార్డు హమీద్ చిత్రంలో నటించిన చిన్నారి తల్హ అర్షద్ రేషికి దక్కింది. హమీద్ చిత్రంలో అర్షద్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమా మొత్తం జమ్మూ కశ్మీర్ ప్రాంతం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను కలిసిన ఆ చిన్నారి దేవుడితో మాట్లాడినంత సంతోషంలో మునిగి తేలుతాడు. ఎన్నో భావోద్వేగాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి.

 కశ్మీర్‌లో ఉన్న ఆంక్షలతో చిన్నారికి సమాచారం చేరవేయలేకపోయాం

కశ్మీర్‌లో ఉన్న ఆంక్షలతో చిన్నారికి సమాచారం చేరవేయలేకపోయాం

హమీద్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయిజాజ్ ఖాన్.. ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం నిజంగా చాలా థ్రిల్లింగ్ అనిపించిందని చెప్పారు. తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న కథనం ఇదని చెప్పారు. చిత్రం విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అయిజాజ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే చిన్నారి తల్హా అర్షద్‌కు ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు వచ్చిందన్న విషయాన్ని తెలపలేకపోయానని చెప్పారు దర్శకులు అయిజాజ్ ఖాన్. ఇందుకు కారణం జమ్మూ కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించడం, ఇంటర్నెట్ సేవలు, ఫోన్ సర్వీసులను బంద్ చేయడంతో తాను ఈ సమాచారంను అర్షద్‌కు చేరవేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆనందం అంతా అర్షద్‌దే ఈ సమయంలో చెప్పకపోతే అంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదని అన్నారు.

 మా కష్టాన్ని జ్యూరీ గుర్తించింది: నిర్మాత

మా కష్టాన్ని జ్యూరీ గుర్తించింది: నిర్మాత

జమ్మూ కశ్మీర్‌లో నెలకొంటున్న పరిస్థితులపై తీసిన సినిమా ఇదని అన్నారు చిత్ర నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ కుమార్. జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో అక్కడ శాంతి నెలకొనేలా, ప్రజలకు బతుకుపై ఆశ కల్పించాలన్న మెసేజ్‌ సినిమాలో ఉందని చెప్పారు. ఈ సినిమా తీసేందుకు చాలా కష్టపడ్డామని చెప్పారు. ఈ సినిమాకు జ్యూరీ జాతీయ అవార్డు ప్రకటించడమంటే తమ కష్టాన్ని గుర్తించిందని అన్నారు .

సీఆర్‌పీఎఫ్ జవాన్..ఎనిమిదేళ్ల బాలుడి చుట్టూ సాగే కథ

సీఆర్‌పీఎఫ్ జవాన్..ఎనిమిదేళ్ల బాలుడి చుట్టూ సాగే కథ

ఇక ఈ చిత్రంలో రసిక దుగ్గల్, విజయ్ కుమార్, సుమీత్ కౌల్, తల్హ అర్షద్ రేషిలు కీలక పాత్రలు పోషించారు. సీఆర్‌పీఎఫ్ జవాన్, ఎనిమిదేళ్ల బాలుడి మధ్య ఏర్పడిన అనుబంధం గురించి ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చి దిద్దారు. జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఈ ఇద్దరూ కలుస్తారు. ఇక ఈ చిత్రమంతా ఎంతో భావోద్వేగాల మధ్య సాగుతుంది. మొత్తం చిత్రీకరణ కశ్మీర్‌లో జరిగింది. ముఖ్య పాత్ర పోషించిన తల్హ అర్షద్ కష్మీర్‌లో నివాసముంటున్నాడు.

English summary
Kashmir boy who won the national award for the film Hamid, was not informed of it. The director of the movie said that it was indeed a sad moment as the phones were Jammed due to the ongoing tensions in the valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X