పోస్టుమార్టమ్ బయటపెట్టిన దారుణాలు..: కథువా చిన్నారిని ఎంతలా హింసించారంటే?
కశ్మీర్: కథువా రేప్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మృగాళ్లు జరిపిన హత్యాచారం అత్యంత పాశవికం. నిందితులు ఆ చిన్నారిని ఏ స్థాయిలో చిత్రహింసలు పెట్టారో 'పోస్టుమార్టమ్' నివేదికలో వెల్లడైంది. గుండె తరుక్కుపోయే రీతిలో ఉన్న ఆ వాస్తవాలను జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది.

పోస్టుమార్టమ్ నివేదికలోని అంశాలు:
- చిన్నారి జననాంగం ఛిద్రమైపోయింది.
- జననాంగం లోపల రక్తపు మరకలు గుర్తించారు.
- ఆమె ఉదరభాగం, అవయవాలు నీలి రంగులోకి మారిపోయాయి.
- తొడలు, ముంజేతులపై బాగా రక్కినట్టుగా గాయాలున్నాయి.
- కుడి చెవి వెనుక భాగంలో బలమైన గాయమైంది.
- చిన్నారి నాలుక బయటకొచ్చింది.

మరిన్ని వివరాలు కావాలి: పోలీసులు
పోస్టుమార్టమ్ లో ఇంకా ఏయే విషయాలు గుర్తించారో వాటన్నింటిపై సమగ్రర నివేదిక ఇవ్వాలని కేసును విచారిస్తున్న పోలీసులు మెడికల్ బోర్డును కోరారు. దీంతో చిన్నారి నడుము కింది భాగంలో బలమైన గాయాలున్నాయని, లైంగిక దాడి వల్లే ఇది జరిగిందని మెడికల్ బోర్డు తెలిపింది.












Click it and Unblock the Notifications