హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబాయ్‌లో ఉన్నా: మృతి చెందిన ‘మహిళా పైలట్’

|
Google Oneindia TeluguNews

దుబాయ్: జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లా కాట్రా పట్టణంలో గత సోమవారం హెలికాప్టర్ కూలిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మహిళా పైలట్ సుమితా విజయన్ తోపాటు ఓ కొత్త జంటతో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు.

త్రికూట పర్వతాల్లోని సంజీచాట్‌ హెలీప్యాడ్‌ నుంచి ఆరుగురు భక్తులతో హెలీకాప్టర్‌ బయలుదేరిందని.. కాట్రాలోని నూతన బస్టాండ్‌ ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుందని ఘటన అనంతరం అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఓ మహిళా పైలట్ తోపాటు మరో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు చెప్పారు.

Katra helicopter crash: 'Dead pilot' Sumita Vijayan says she is alive

కాగా, తాజాగా, ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తాను మరణించలేదంటూ సుమితా విజయన్ ఫేస్‌బుక్ ద్వారా పేర్కొంది. తాను ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నట్లు తెలిపింది. మీడియా తన ఫొటోను తప్పుగా ఉపయోగించి గందరగోళానికి దారితీసిందని పేర్కొంది.

Dear all, please do not be overwhelmed with ths rubbish by media!! I m very much alive and breathing!!

Posted by Sumita Vijayan on Monday, November 23, 2015

అయితే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సుమితా విజయన్‌కు బదులు ఈమె ఫొటోను మీడియా తప్పుగా ప్రచురించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన ఈ సుమితా విజయన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. గత 15ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లు తెలిపింది. హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆమె ఫొటోను ప్రచురితం చేయడంతో ఆమెకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి చాలా ఫోన్లు వెళ్లాయి.

దీంతో మీడియాపై ఆగ్రహానికి గురైన సునీతా విజయన్ ఫేస్‌బుక్ ద్వారా తాను బతికే ఉన్నట్లు సందేశం పంపింది. హెలికాప్టర్ ఘటనలో మరణించింది తాను కాదని తెలిపింది. మీడియా తప్పుగా తన ఫొటోను ప్రచురితం చేయడం వల్లే ఇన్ని ఇబ్బందులని ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా పేర్కొంది. తన ఫొటోను ప్రచురితం చేసిన మీడియాకు నోటీసులు పంపిస్తానని పేర్కొంది.

English summary
Seven people including six pilgrims and a woman pilot were killed in a chopper crash near the Vaishno Devi shrine in Jammu earlier this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X