• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్: తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీకి నేడే నోటిఫికేషన్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటనపై కీలక ప్రకటన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరో 11,103 ఒప్పంద ఉద్యోగలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు.

''రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. తెలంగాణలో 91,142 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో 80,039 ఉద్యోగాలకు ఈ రోజే నోటిఫికేషన్ జారీ చేస్తారు'' అని కేసీఆర్ ప్రకటించారు.

kcr

ఆయన బుధవారం ఉదయం శాసనసభలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఈ ఉద్యోగాల్లో 11,103 కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

''మిగతా 80,039 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేస్తాం’’ అని చెప్పారు. ఇందులో విద్యాశాఖలో 25 వేల నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

https://twitter.com/ANI/status/1501427337375928320

ఏ గ్రూపు పోస్టులు ఎన్నంటే...

గ్రూప్ 1: 503

గ్రూప్ 2: 582

గ్రూప్ 3: 1,373

గ్రూప్ 4: 9,168

జిల్లా పోస్టులు: 39,899

జోనల్ పోస్టులు: 18,866

మల్టీ జోనల్ పోస్టులు: 13,170

సచివాలయం, హెచ్‌ఓడీలు, విశ్వవిద్యాలు: 8,100

గరిష్ట వయోపరిమితి పదేళ్లు పెంపు...

ఈ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి పదేళ్లు సడలిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

జనరల్ కేటగిరీ: 44 సంవత్సరాలు

బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ: 49 సంవత్సరాలు

వికలాంగులు: 54 సంవత్సరాలు

'ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ తెలంగాణ ఉద్యోగులే’

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజన కూడా పూర్తయితే, మరో 10 వేలు, 20 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు.

కేసీఆర్ తన ప్రసంగంలో ఇప్పటివరకూ చేపట్టిన ఉద్యోగుల నియామకాల గురించి చెప్పారు.

''ఇంతవరకూ 1.12 లక్షా, 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం. 1.33 లక్షలు రిక్రూట్ చేశాం’’ అని తెలిపారు.

అయితే.. ఉద్యోగుల విభజనపై ఆంధ్రప్రదేశ్‌తో 'పంచాయతీ’ తెగకపోవటం వల్ల గ్రూప్ 1 తదితర ఉద్యోగాలను నోటిఫై చేయలేకపోయామన్నారు.

డిసెంబర్‌లో ఉద్యోగలు విభజన పూర్తవటంతో ఖాళీలను తేల్చామన్నారు.

''తెలంగాణ సంపన్న రాష్ట్రమవుతుందని మేం చెప్పాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ తెలంగాణ ఉద్యోగులే'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

'నీళ్లు, నిధులు, నియామకాలు...'

కేసీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించారు. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానాంశాలుగా ఉన్నాయని.. వాటిలో నీళ్లు, నిధులు సాధించామని.. నియామకాలు పూర్తవటానికి ఆంధ్రాతో ఉన్న పంచాయతీ కారణంగా ఆలస్యమైందని చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

''ఒకప్పుడు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ రూపంలో ఒక దేశంగా ఉండేది. ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాక ఒక రాష్ట్రంగా ఉండేది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక భాగంగా ఉండేది.

అనంతరం.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాల పరంపర దశాబ్దాల పాటు కొనసాగింది. అంతులేని వివక్ష, అంతులేని అన్యాయంతో తెలంగాణ అణగిపోయింది. 1969లో తొమ్మిదో తరగతి విద్యార్థిగా ఉన్న నేను కూడా లాఠీ దెబ్బలు తిన్నా.

2014లో తెలంగాణ ఏర్పడే నాటికి ఆకలి చావులు, ఆత్మహత్యలు లక్షల సంఖ్యలో వలసలు, నిరాశలో నిర్లిప్తతలో యువత, తుపాకులు పట్టుకుని తీవ్రవాదులైన సందర్భాలు మనం చూశాం.

ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాళలోకానికి తొక్కేసినటువంటి భయంకరమైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఆంక్షలను అమలు చేశారు.

నాడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నేను పిడికెడు మందితో స్టార్ట్ చేశాం. ప్రజల దీవెన, భగవంతుడి దయ, 14, 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సాకారమైంది.

ఆ రోజు ఇదే స్థలం నుంచి నేను చెప్పాను. తెలంగాణ తనను తాను పునర్‌దర్శించుకోవాలి, తనను తాను పునర్‌నిర్వచించుకోవాలి అని చెప్పాను. తనను తాను ఆవిష్కరించుకోవాలని చెప్పాను.

'మాకు రాజకీయాలంటే గేమ్ కాదు టాస్క్...

కొందరు బాధ్యతున్న వాళ్లు, కొంతమంది లేనివాళ్లు ఉన్నారు. కొంతమంది పనికిమాలిన వాళ్లు తమ మీద కూడా కామెంట్లు చేశారు. ఎవరు ఏం చేసినా కూడా.. వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు ఒక గేమ్. మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్. పవిత్రమైన కర్తవ్యం.

మేం చేసే పనిలో మా ఏకాగ్రతను దెబ్బతీసే డిస్ట్రాక్టర్లు. చిల్లరగాళ్లని వదిలిపెట్టాం. మాకు కార్యకర్తలు లేక కాదు. బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళుతున్నాం. అందులో సఫలీకృతులమయ్యాం.

ఉద్యమంలో ఉన్నపుడు.. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానమైనవి. ఈ మూడూ తెలంగాణకు ముఖ్యమైనవి. నాడు తెలంగాణ నీళ్లు తెలంగాణవి కావు, తెలంగాణ ఉద్యోగాలు తెలంగణవి కావు. తెలంగాణ నిధులు తరలిపోతాయి.

ఇప్పుడు నీళ్లలో వాటా తెచ్చుకున్నాం. ఇంకా కొట్లాడుతున్నాం. గోదావరిలో నీళ్లు వేస్ట్ పోతున్నాయి, మాకిస్తే ఏమవుతుందని నేనే అడిగినా. ఇవ్వలే. ఇప్పుడు తెచ్చి చూపినాం. ఇంకా పోరాడుతున్నాం.

నిధులైతే మన పైసా మనకే ఖర్చవుతోంది. ఒక్క రూపాయి కూడా వేస్టవటం లేదు.

'కాలికి పెడితే మెడకి, మెడకి పెడితే కాలికి....’

ఇక నియామకాలు. ఈ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్లకి అక్కసు. కరెంటు ఉద్యోగుల పంచాయతీ సుప్రీంకోర్టుకు పోయింది. ఇంకా తెగలేదు. 9, 10 షెడ్యూల్డు ఉద్యోగుల పరిస్థితి. కాలికి పెడితే మెడకి, మెడకి పెడితే కాలికి.

నిజాం రాజున్న కాలంలో ఆ మూసీ నది పొంగితే హైదరాబాద్‌కి వరదలొచ్చాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి గండిపేట కట్టారు.

విశ్వేశ్వరయ్య గౌరవార్థం లంచ్ ఏర్పాటు చేశారు. 'మంచి పని చేశారు. నిజాం గారు. అనంతగిరి కొండల నుంచి మంచి ఔషధ నీరు వస్తుంది దానిని తాగునీరు కోసం వాడుకోవచ్చు అని చెప్పారు. వ్యవసాయ పరిశోధనలు చేపడితే మంచిదన్నారు.

అప్పటికప్పుడు 5,000 ఎకరాలు ఇచ్చి వ్యవసాయ కాలేజీ పెట్టారు నిజాం. అందులో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ అడుగుతోంది. అలాగే ఆర్‌టీసీ కార్యాలయాన్ని ఓయూ భూమిలో పెట్టారు. ఇప్పటికీ అది ఓయూ భూమే. అందులో మాది సగం అంటారు. వాళ్లు వినటం లేదు.

ఉద్యోగాల విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు పోయి చెప్పినా పరిష్కారం చేయరు. ఆర్డర్ టు సర్వ్ అని ఓ ఆర్డర్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఆర్నెల్లు అక్కడా, ఇక్కడా అనేది లేదు.

ఆంధ్రప్రదేశ్ రెసిడ్యురీ స్టేట్ కాబట్టి సీనియారిటీ వాళ్లు ఫైనల్ చేస్తారు. దాదాపు వెయ్యి పోస్టులు సూపర్ న్యూమరీ పోస్టులు వెయ్యాల్సి వచ్చింది.

'95 శాతం పోస్టులు లోకల్...

1919లో నిజాం ఇచ్చిన ముల్కీ రూల్స్ ఉన్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అన్నీ కాలరాశారు. ముల్కీ రూల్స్‌కు మించిన స్పిరిట్ అమలుకావాలి. తెలంగాణకు న్యాయం జరగాలంటే.

పటిష్టమైన రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. శాశ్వత ప్రయోజనాలు చేకూరాలి. మంచిగా జరగాలి. ఆ కోణంతో పనిచేశాం.

ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావాలని పంపినాం. కేంద్రంలో దాన్ని ఏడాది పాటు పెండింగ్‌లో పెట్టారు. నేను అదే పనిగా ఢిల్లీ వెళ్లి తిరిగి తిరిగి రాష్ట్రపతి, ప్రధానిలను కలిసి వివరించాను.

తెలంగాణ హక్కులను శాశ్వత ప్రాతిపదికన 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చాం. అది మేం చేసింది. నాలుగు రోజులు ఆలస్యమైతే అయింది కానీ.

గతంలో స్టేట్ లెవల్ పోస్టులని పెట్టి మొత్తం కొట్టేశారు. అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టు దాకా అన్నీ లోకల్‌కే వస్తాయి. మిగతా 5 శాతంలో కూడా ఓపెన్ కేటగిరీలో మనకే వస్తాయి.

ఒక్క సెక్రటేరియట్‌ తప్ప మిగతా అన్నీ కూడా 95 శాతం లోకల్.

'తెలంగాణ నేడు నంబర్ వన్

జీఎస్‌డీపీ పర్ కాపిటాలో నేడు తెలంగాణ నంబర్ వన్. 24 గంటలు అన్ని రంగాలకూ క్లీన్ పవర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా? ఇది మా ఘనత కాదా?

మేం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించుకున్నాం. తెలంగాణ సంపన్న రాష్ట్రమవుతుందని మేం చెప్పాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ తెలంగాణ ఉద్యోగులే.

సమైక్య పాలకులు కాంట్రాక్టు ఉద్యోగం అనే దుర్మార్గమైన పని చేశారు. మేం దానిని రద్దు చేశాం. పార్టీలే కోర్టుకు పోయాం. మేం కూడా పోరాటం చేసి గెలిచాం.

చిన్న ఉద్యోగులకు కూడా 30 శాతం పేరివిజన్ ఇచ్చాం. హైలీ పెయిడ్ హోంగార్డులు ఉండే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఒక్కటే.

ఇండియాలో అతి తక్కువ అప్పులుండే రాష్ట్రం తెలంగాణనే. చాలా రాష్ట్రాల కన్నా తక్కువ అప్పులుంటాయి. కడుపు కట్టకుని, నోరు కట్టుకుని, అవినీతి రహితంగా పరిపాలిస్తున్నాం.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
KCR:80039 posts will be given notification from today itself
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X