వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్..: అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత్ రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ తో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేసిన కేసీఆర్.. జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో పొత్తులపై ఆయా పార్టీల నేతలతో భేటీ కానున్నారు.

బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ సహా నేతల కసరత్తు: అఖిలేష్

బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ సహా నేతల కసరత్తు: అఖిలేష్

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‍సభ ఎన్నికలలోపు బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. అధికార బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని రూపొందించే పనిలో కేసీఆర్ సహా ప్రతిపక్ష నాయకులు నిమగ్నమయ్యారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ తోపాటు బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరిందని, నిరుద్యోగం పెరుగుతోందని అఖిలేష్ ఆరోపించారు.

ఇప్పటికే పలుమార్లు కేసీఆర్, అఖిలేష్ భేటీలు

ఇప్పటికే పలుమార్లు కేసీఆర్, అఖిలేష్ భేటీలు

కాగా, ఇప్పటికే కేసీఆర్, అఖిలేష్ యాదవ్ పలుమార్లు జాతీయ రాజకీయాలపై సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేక కూటమిపై చర్చించారు. తాజాగా, కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు. కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదట కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్నామ్నాయంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అయితే, అఖిలేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించకపోవడం గమనార్హం.

సోనియాకు అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ పాదాభివందనం

సోనియాకు అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ పాదాభివందనం

ఇది ఇలావుండగా, ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీగా ప్రమాణం చేసిన వెంటనే ఆమె కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పాదాలకు నమస్కారం చేశారు.
మరోవైపు, డింపుల్ యాదవ్ లోక్‌సభలో హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా.. అఖిలేష్ యాదవ్ సందర్శకుల గ్యాలరీలో కూర్చుని వీక్షించారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మైన్‌పురి స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ములాయం కోడలు డింపుల్ యాదవ్ 2 లక్షల 88 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

English summary
KCR and others working on Alternative alliance for BJP, says Akhilesh Yadav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X