కేదార్‌నాథ్ యాత్రీకులకు కీలక అప్‌డేట్
డెహ్రాడున్: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో భారీ వర్షాలకు కారణం అయ్యాయి. ముంబైని ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు చోట్ల పట్టాలపై నీళ్లు చేరుకోవడంతో ఆయా మార్గాల్లో తిరిగే సబర్బన్ రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి.
అటు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లల్లో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది. పంచ్‌కుల వద్ద హఠాత్తుగా వరదనీరు పోటెత్తిన ఘటనలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఓ మహిళను స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. దేశ రాజధానిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తరువాత వేగం పుంజుకొన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు విస్తరించాయి. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
భారీ వర్షాలు పడితే.. ఉత్తరాఖండ్‌లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది తెలిసిందే. ఇప్పుడూ అలాంటి వాతావరణమే నెలకొంది. భారీ వర్షాల వల్ల పలు చోట్ల కొండ చరియలు విరుచుకుపడుతున్నాయి. పలు జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరుచుకుపడటం వల్ల రహదారులు మూసుకుపోయాయి. పలు చోట్ల కోసుకుపోయాయి. డెహ్రాడున్, రుద్రప్రయాగ్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు చాలా బీభత్సం సృష్టించాయి.

గౌరీగంగ, రామగంగ, మందాకినీ, సెరా, జకులా, ఘోసీ నదులు ఉప్పొంగుతున్నాయి. వాటిల్లో నీటిమట్టం పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సోన్‌ప్రయాగ్‌లో కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు యాత్రను నిలిపివేస్తున్నట్లు రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ ఉదయం 8 గంటల వరకు మొత్తం 5,828 మంది ప్రయాణికులు సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోవడంతో వారిని మళ్లీ వెనక్కి పిలిపిించారు. కేదార్‌నాథ్‌కు వెళ్లిన భక్తుల కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ఈ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications