అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు..!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరం హోరెత్తుతోంది. త్రిముఖ పోటీ ఆసక్తి పెంచుతోంది. ఎన్నికల హామీల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ ల అధినేతలు హామీలు గుప్పిస్తున్నారు. మారుతున్న సమీకరణాలతో పార్టీల నాయకత్వం అప్రమ త్తం అవుతోంది. బీజేపీ తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పుడు మాజీ సీఎం ... ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మరో కీలక హామీ ప్రకటించారు.
హోరెత్తుతున్న ప్రచారం
ఢిల్లీలో ఎన్నికల పైన ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. కొంత కాలంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎవరికి విజయం దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకొనే ప్రయత్నంలో కేజ్రీవాల్ ఉన్నారు. ఈ సారి అధికారం తమదే అనే ధీమాతో బీజేపీ నేతలు కనిపిస్తు న్నారు. కాగా, కాంగ్రెస్ పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని వాదిస్తోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు...స్థానిక సమస్యలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఆప్ మరోసారి విజయం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల హామీల్లో జాతీయ పార్టీలతో పోటీ పడుతోంది.

ఉచిత విద్యుత్ - నీరు
అందులో భాగంగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో హామీని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలోని అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని పేర్కొన్నారు. పూర్వాంచల్‌కు చెందిన అనేక మంది కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తనకు అద్దెకు ఉండే వారి నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమకు ఉచిత విద్యుత్, నీరు లేవని వారు వాపోతున్నారని..వారికి ఉపశమనం కలిగించేలా తాము అధికారంలోకి వస్తే కొత్త నిర్ణయాలు ఉంటాయని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
పోటా పోటీగా హామీలు
కాంగ్రెస్ ఇప్పటికే భారీ హామీలు ఇచ్చింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ 55 కే గ్యాస్, ఉచిత రేషన్ కిట్లు, నిరుద్యోగ యువతకు రూ 8,500, ప్రతీ నెలా మహిళలకు రూ 2,500 ఆర్దిక సాయం.. రూ 25 లక్షల వరకు ఆరోగ్య భీమా పైన హామీ ఇచ్చింది. తాజాగా బీజేపీ సంకల్ప పత్రా పేరుతో గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ తన హామీలను ప్రకటించారు. దీంతో, ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది రాజకీయం గా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications