కశ్మీర్ ఫైల్స్ పై కేజ్రీవాల్ సంచలనం - కళ్లు తెరవండి : యూట్యూబ్‌లో అప్‌లోడ్..!!
ది కశ్మీర్ ఫైల్స్ . ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక సంచలనం. రాజకీయంగా అన్ని పార్టీలను కదలించిన సినిమా. విమర్శలకు - ప్రశంసలకు కారణమైన చిత్రం. ఈ సినిమా పైన స్వయంగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని ఇప్పటికే ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇచ్చాయి. మరి కొన్ని చోట్ల ఈ సినిమా చూడటం కోసం ఉద్యోగులు..పోలీసులకు కూడా సెలవులు ఇచ్చారు. ఈ సినిమా రూ 200 కోట్ల బిజినెస్ క్లబ్ లో చేరింది. ఇక, ఈ సినిమా యూనిట్ కు ఈ రోజు జరిగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.

రూ 200 కోట్ల వసూళ్లు చేసిన సినిమా
ఈ సినిమాకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది కేవలం రాజకీయా ప్రయోజనాల కోసం తీసిన చిత్రమంటూ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఈ సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ పరిధిలోని సినిమా హాళ్లల్లో ప్రదర్శిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్ ను కోరారు.

కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఆ సమయంలో సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపు పైన తప్పు బట్టారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు మాత్రం సినిమా పోస్టర్లు వేసే పనిలో నిమగ్నమయ్యారంటూ ఆరోపించారు. సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వటం కాదని.. ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయమని దర్శకుడికి చెప్పండంటూ సూచించారు.

యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయాలంటూ
దీంతో..ప్రజలందరికీ ఈ సినిమా ఉచితంగా చేసే వెసులుబాటు కలుగుతుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీంతో..ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేసారు. ఇప్పటికే ఈ సినిమా పైన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సైతం దీని పైన స్పందించారు. ప్రజలను విభజించి పాలించే విధానాన్ని అన్ని పార్టీలు మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications