వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం షీలాదీక్షిత్‌తో కేజ్రీవాల్ ఢీ: గెలుస్తాడని తల్లీ ధీమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kejriwal files nomination to challenge Delhi CM Sheila Dikshit
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీకి దిగుతున్నారు. శనివారం నామినేషన్ల గడువు ముగుస్తుండగా న్యూఢిల్లీ స్థానానికి ఆయన తన పత్రాలను సమర్పించారు. ఆయనతోపాటు బిజెపి అభ్యర్థి విజేందర్ గుప్తా రంగంలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

తల్లిదండ్రులు గీత, గోవిందరామ్‌లతోపాటు భార్య సునీత, వందలాది మద్దతుదారులు వెంట రాగా, జామ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. సిఎం ఎక్కడనుంచి నామినేషన్ వేస్తారో తెలుసుకుని, ఆమెపై పోటీ చేయదలచినందువల్లే చివరి రోజుదాకా ఆగినట్లు ఈ సందర్భంగా వివరించారు.

తమ దంపతులకు గుర్‌గావ్‌లో ఒక ఫ్లాట్, ఘజియాబాద్‌లో ఇంటిస్థలంసహా ఉమ్మడిగా రూ.2 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. అలాగే షీలాదీక్షిత్, ఆమె కార్యదర్శి పవన్ ఖేరాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదైనట్లు వివరించారు. కాగా, తన కుమారుడి పార్టీ 47 స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ తల్లి ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీపై ఫిర్యాదు

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీపై ఈసికి బిజెపి ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగల పార్టీగా రాహుల్ వ్యాఖ్యానించారని బిజెపి ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆరోపించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు ఆయన చెప్పారు. రాహుల్‌కు ఇది ఓ అలవాటుగా మారిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ చరిత్రను చెప్పుకుంటూ పదేపదే కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు.

English summary

 AAP convener Arvind Kejriwal on Saturday filed his nomination for the Delhi polls from the New Delhi assembly constituency, thus officially entering his name for what promises to be an epic three-way battle for the seat between himself, Delhi chief minister Sheila Dikshit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X