కర్రలతో కొట్టుకున్నబిజెపి, ఎఎపి: కేజ్రీవాల్ కారు ధ్వంసం

Kejriwal in Modi land sparks clashes between BJP, AAP in three states
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/లక్నో: భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కార్యకర్తలు బుధవారం బాహాబాహీకి దిగారు. ఎఎపి సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గుజరాత్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు నిరసనగా బుధవారం సాయంత్రం ఎఎఫి ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కర్రలతో కొట్టుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి.

పోలీసులు లాఠీఛార్జ్ చేసి, బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎఎపి కార్యకర్తలను అరెస్టు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై బిజెపి దాడి చేసిందని ఎఎపి చెబుతుండగా, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక అనుమతిలేకుండా ఎలా ధర్నా చేస్తారని, మొదట వారు విధ్వంసం సృష్టించారని బిజెపి ఆరోపించింది.

మరోవైపు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో బిజెపి మద్దతుదారులు అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పైన దాడి చేశారు. ఆయన ధ్వంసమైన కారులోనే వెళ్లారు. గుజరాత్ వచ్చిన కేజ్రీవాల్‌కు పలుచోట్ల నిరసనకారులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. ఎఎపి నర్మదా వ్యతిరేకి అని, కేజ్రీవాల్ కాంగ్రెస్ ఏజెంట్ అని నినాదాలు చేశారు.

కేజ్రీవాల్ క్షమాపణ

బిజెపి, ఎఎపి కార్యకర్తల ఘర్షణ పైన గురువారం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావని చెప్పారు.

అభివృద్ధి లేదు

మోడీపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్‌ను బుధవారం రాఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు నిర్బంధించడంతో ఆయన ఈ విమర్శలు గుప్పించారు. గుజరాత్ ఉత్తర ప్రాంతంలో బుధవారం ఈ పర్యటన ప్రారంభమైన కొద్దిసేపటికే కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేసి రాఘన్‌పూర్ స్టేషన్‌కు తరలించారు.

గుజరాత్‌లో అభివృద్ధి జరగలేదని, మోడీ ప్రచారంలో వాస్తవం లేదని, రైతులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ మద్దతుదారులు కేజ్రీవాల్‌కు నల్లజెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌ను నిర్భందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+