Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా భార్యను తీసుకు రమ్మన్నారు: కేజ్రీపై సిద్ధూ తీవ్ర ఆరోపణలు

న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బయటకొచ్చి ఆప్‌లో చేరతారని భావించిన నవజోత్ సింగ్ సిద్ధూ కొత్త పార్టీని ప్రకటించారు. గురువారం చంఢీగఢ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధు తన పార్టీ పేరును ప్రకటించారు. 'ఆవాజ్-ఇ- పంజాబ్' పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.

ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ పంజాబ్‌కు తిరిగి పునర్వైభవం తీసుకురావడం కోసమే 'ఆవాజ్-ఇ- పంజాబ్' పార్టీని స్థాపించినట్లు పేర్కొన్నారు. గత జులైలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ రాజకీయాల్లో ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే కానీ సొంత ప్రయోజనాల కోసం కాదని చెప్పారు.

Kejriwal Only Wants Yes Men, Says Navjot Sidhu At Launch Of His Own Party

తన అడుగులకు మడుగులు ఒత్తేవారే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కావాలని, వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్న వారిని ఆయన పక్కన పెడతారని సిద్ధూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మాటలకు 'ఎస్' అనే వారే తన పక్కన ఉండాలన్నది ఆయన అభిమతమని, తాను ఆ విధానానికి పూర్తి వ్యతిరేకినని చెప్పారు.

''వందమంది చెడ్డవాళ్ల కంటే ఒక్క మంచి వాడు చాలా గొప్పోడు. పంజాబ్ గెలుస్తుంది, పంజాబియత్ గెలుస్తుంది. పంజాబీలు గెలుస్తారు'' అనేదే తమ నినాదమని ఆయన చెప్పారు. "ఎన్నికల్లో పోటీ చేయవద్దని కేజ్రీవాల్ నాకు చెప్పారు. నా భార్యను బరిలోకి దించాలని సూచించారు. ఆమెను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు ఎస్ అనే వారే కావాలి" అని ఆరోపించారు.

'మంచి పౌరులను అలంకరణ వస్తువులుగా ఉంచి ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవడం గత కొంతకాలంగా దేశంలో ఆనవాయితీగా వస్తోంది' అని సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంటే ప్రజలకోసం ఉండాలి.. కానీ పంజాబ్ లో మాత్రం ఒక కుటుంబానికే ప్రభుత్వం ఉందని విమర్శించారు.

దేశంలోనే ఓ పక్క అత్యుత్తమ క్రీడాకారులను పంజాబ్ అందిస్తుండగా వీధుల్లో మాత్రం డ్రగ్స్ బారిన పడినవారు చాలామంది ఉన్నారని, ఆ వ్యవస్థను సమూలంగా మారుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో బీజేపీ, అకాలీదళ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ఐదు నెలలే సమయం ఉండటంతో పార్టీ పెట్టిన సిద్ధూపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. పంజాబ్ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు ఈ సమయం సరిపోదని అంటున్నారు. అయితే సిద్ధూ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ఇతర పార్టీలకు చెందిన ఓట్లను చీలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారంలో సిద్ధూ తన స్నేహితుడు, మాజీ హాకీ గ్రేట్ పర్గాత్ సింగ్‌తో కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+