షాక్: సచివాలయంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు చోరీ

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వేగాన్ కారు చోరీకి గురైంది. ఒక ముఖ్య‌మంత్రి కారు అది కూడా ఢిల్లీలోని స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే చోరీ కావ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది.

ఆ కారుని ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది. గురువారం మధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో ఆ కారును ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చోరీ చేశాడ‌ని సమాచారం.

 Kejriwal's Wagon R stolen outside the Delhi Secretariat

కాగా, తనకు ఎంతో ప్రత్యేక అనుబంధం ఉన్న బ్లూ వేగాన్ కారు చోరీకి గురవడంపై సీఎం కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, సీఎం కారు చోరీకి గురవడంపై సెక్రటేరియట్ భద్రతాధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు కూడా దొంగల కోసం గాలింపు ప్రారంభించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi Chief Minister Arvind Kejriwal's Wagon R car, used till the 2015 assembly polls, was stolen outside the Delhi Secretariat on Thursday, the police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి