ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు అవినీతికి పర్యాయపదాలు: కేరళలో జేపీ నడ్డా విమర్శలు
కన్నూర్: కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ అవినీతికి పర్యాయపదాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు అయోమయంలో ఉన్నాయని, సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. కన్నూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై మండిపడ్డారు.
మహారాష్ట్రలో కరోనా మరో రికార్డు: ఒక్కరోజులో 36వేలకుపైగా కొత్త కేసులు, సెంచరీ దాటిన మరణాలు
యూడీఎఫ్ హయాంలో సోలార్ కుంభకోణం, ఎల్డీఎఫ్ హయాంలో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. ఈ రెండు కూటముల అవినీతిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్, సీపీఎం కేరళలో ఒకరిపై ఒకరు పోటీ పడుతూ.. పశ్చిమబెంగాల్‌లో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయని జేపీ నడ్డా మండిపడ్డారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ కేరళ అభివృద్ధి కోసం రూ. 2 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినదానికంటే ఇది మూడు రెట్లు అధికమని చెప్పారు.
శబరిమల అంశంపై బీజేపీ స్థిరంగా పోరాడుతోందన్నారు జేపీ నడ్డా. అయితే, సీపీఎం, సీఎం పినరయి విజయన్ తమ పోరాటాన్ని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్రం కేవలం మాటలకే పరిమితమైపోయిందని విమర్శించారు.
మెట్రోలు, జాతీయ రహదారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబడిందని, కేరళను శుద్ధి కర్మాగారాల కేంద్రంగా కేంద్రం మార్చిందని నడ్డా చెప్పుకొచ్చారు. శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ పైప్‌లైన్ అభివృద్ధికి సుమారు రూ. 12,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ధర్మదామ్‌లో ఎన్డీయే నుంచి పోటీ చేస్తున్న సీకే పద్మనాభన్ తరపున చక్కరక్కల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా, కొద్ది రోజుల్లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికర ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్‌లతో తలపడుతోంది బీజేపీ.