వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NITI Aayog health index 2021-కేరళ టాప్-యూపీ లాస్ట్- తెలంగాణపైకి-ఏపీ కిందకు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకులు ప్రస్తుతం దేశంలో ఆరోగ్య పరిస్ధితుల్ని కళ్లకు కట్టాయి. నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రమాణాల్ని అందుకోవడంలో కొన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరిచి టాప్ లో నిలవగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అట్టడుగుకు చేరాయి. తెలుగు రాష్ట్రాలు తమ స్ధానాల్ని పరస్పరం మార్చుకున్నాయి. 2019-20 సంవత్సరానికి ప్రకటించిన ఈ ర్యాంకుల్లో పలు విశేషాలున్నాయి.

 నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ 2021

నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ 2021

కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ తాజా ర్యాంకులు ఇవాళ విడుదలయ్యాయి. ప్రతీ ఏటా కేంద్రం ఇచ్చే ఆరోగ్య ప్రమాణాల లక్ష్యాలను అందుకున్న రాష్ట్రాలకు వరుసగా ర్యాంకులు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్రం 2019-20 సంవత్సరానికి హెల్త్ ఇండెక్స్ ర్యాంకుల్ని ఇవాళ ప్రకటించింది. ఇందులో వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రమాణాలు, వాటిని అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు స్పష్టమయ్యాయి. మొత్తం నాలుగు విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.

 ఆరోగ్యంలో కేరళ టాప్, యూపీ లాస్ట్

ఆరోగ్యంలో కేరళ టాప్, యూపీ లాస్ట్

కేంద్రం ప్రకటించిన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకుల్లో పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత స్ధానాల్లో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. ఈ ర్యాంకుల్లో చివరిస్ధానంలో యూపీ నిలిచింది. ఏపీ తర్వాత స్ధానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే చిన్న రాష్ట్రాల హెల్త్ ఇండెక్స్ జాబితాలో మిజోరం, త్రిపుర, సిక్కిం వరుసగా టాప్ 3లో నిలిచాయి. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ జాబితాలో అట్టడుగున ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి.

 నీతి ఆయోగ్ రిపోర్ట్ లో కీలకాంశాలు

నీతి ఆయోగ్ రిపోర్ట్ లో కీలకాంశాలు

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తున్నప్పటికీ, జనాభా ఆరోగ్యంలో మన విజయాలు వేగాన్ని అందుకోలేకపోయాయని నీతి ఆయోగ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 2015లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లచే ఏకగ్రీవంగా ఆమోదించబడిన జాతీయ అభివృద్ధి ఎజెండా ప్రకారం, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, మహిళలు, పిల్లలు ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించారు. జాతీయ అభివృద్ధి ఎజెండాను సాధించడానికి ఈ రంగాలలో వేగవంతమైన అభివృద్ధి తప్పనిసరిని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య బాధ్యతను పంచుకున్నప్పటికీ, ఆరోగ్యం రాష్ట్ర అంశం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో అమలు చేయడం ఎక్కువగా రాష్ట్రాలచే చేయబడుతుంది.

ఇతర దేశాలతో కలిసి, భారతదేశం పేదరికాన్ని అంతం చేయడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, 2030 నాటికి కొత్త ప్రపంచ స్థిరమైన అభివృద్ధి ఎజెండాలో ఒక భాగంగా అందరికీ శ్రేయస్సును నిర్ధారించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్వీకరించడానికి కట్టుబడి ఉంది.

English summary
kerala stand top and uttar pradesh stands last in niti aayog health index ranks annouced today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X