మాతో పెట్టుకోవద్దు: బీజేపీకి కేరళ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెంగర ఉపఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కేరళతో పెట్టుకోవద్దు..' అంటూ హెచ్చరించారు.
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెంగర ఉపఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కేరళతో పెట్టుకోవద్దు..' అంటూ హెచ్చరించారు.
అంతేకాదు, బీజేపీ చేపట్టిన జన రక్షా యాత్రపై కూడా విజయన్ విమర్శలు ఎక్కుపెట్టారు. నెలరోజల పాటు చేపట్టిన యాత్ర దండగ అంటూ దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో గెలవడానికి బీజేపీ మత ఛాందసవాదాన్ని ఆడ్డుపెట్టుకోవడంతోపాటు నీచ రాజకీయాలకు దిగిందంటూ విరుచుపడ్డారు.

ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారని, అందుకే నాలుగోస్థానానికి పడిపోయిందని సీఎం వ్యాఖ్యానించారు. 'ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి.. కేరళతో పెట్టుకోకండి.. ఇది మా స్ట్రాంగ్ వార్నింగ్..' అని విజయన్ అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలో బీజేపీ కేరళ పర్యాటక రంగాన్ని దెబ్బతీసేలా విష ప్రచారం చేస్తోందని,'బాయ్‌కాట్ కేరళ' పేరుతో పర్యాటకులు కేరళ రాకుండా బీజేపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని సీఎం విజయన్ ఆరోపించారు. అలాగే అసత్య వార్తలను కేరళ ప్రజలు, పర్యాటకులు నమ్మరాదని ముఖ్యమంత్రి కోరారు.












Click it and Unblock the Notifications