జడ్జీలను ఫూల్స్ అన్నందుకు మాజీ ఎమ్మెల్యేకు 4 వారాల జైలు
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఓ సిపిఎం నాయకుడు కటకటాలపాలయ్యాడు. సుప్రీం కోర్టు అతనికి నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదాలను, ప్రజలకు ఇబ్బందులను కలకుండా ఉండాలనే ఉద్దేశంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డు పక్కన బహిరంగ సభలను నిషేధించింది.
ఈ తీర్పుపై సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంవి జయరాజన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తీర్పు చెప్పిన జడ్జీలను ఫూల్స్ అంటూ నిందించాడు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు జయరాజన్‌కు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది.

జస్టిస్ విక్రమ్ జీత్, నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తీర్పుపై విమర్శలు వస్తే సమస్య లేదని, అయితే న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించింది.
2010, జూన్ 23న కేరళ హైకోర్టు రోడ్లపై, రోడ్ల పక్కన బహిరంగ సమావేశాలను నిషేధిస్తూ తీర్పు చెప్పింది. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. కాగా, తీర్పు వెలుడిన మూడు రోజుల తర్వాత జయరాజన్.. ఓ బహిరంగ సభలో తీర్పు ఇచ్చిన దూషిస్తూ తన ప్రసంగం కొనసాగించాడు. దీంతో అతనికి హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా, అతడ్ని మందలించిన సుప్రీం కోర్టు, నాలుగు వారాల జైలు శిక్షను విధించింది.












Click it and Unblock the Notifications